న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది ఊహాతీతం.. పంత్‌కు ఛాన్సివ్వడంపై నెటిజన్ల ఆశ్చర్యం.!

IND VS NZ,1st Test : Rishabh Pant's Selection Over Wriddhiman Saha Leads Twitter Debate | Oneindia
Twitter comes up mixed reactions as Rishabh Pant is picked ahead of Saha in Wellington Test

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన పంత్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పంత్‌కు అవకాశమే లేదన్నారు..

పంత్‌కు అవకాశమే లేదన్నారు..

కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్, ఆటతీరు పుణ్యమా.. పరిమిత ఓవర్లలో అవకాశాన్ని అందుకోలేకపోయిన పంత్.. టెస్ట్‌ల్లో స్పెషలిస్ట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రాకతో మరోసారి అతనికి మొండి చేయి ఎదురువుతుందని అందరూ భావించారు. సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో సాహానే కీపర్‌గా కొనసాగడం, అతని కీపింగ్ నైపుణ్యాలు కూడా పంత్ కన్నా మెరుగ్గా ఉండటంతో ఈ మ్యాచ్‌లో కూడా పంత్‌కు నిరాశ తప్పదనుకున్నారు. ప్రతీ క్రికెట్ విశ్లేషకుడి ప్రివ్యూలో కూడా ఇదే రాసుకొచ్చారు. కానీ కెప్టెన్ కోహ్లీ పంత్‌కు అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ప్రాక్టీస్‌ బ్యాటింగ్‌తోనేనా?

ప్రాక్టీస్‌ బ్యాటింగ్‌తోనేనా?

అయితే న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ అదరగొట్టాడు. కేవలం 65 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అద్భుత షాట్లతో అలరించాడు. ఇక సాహా కేవలం 30 పరుగులే చేశాడు. అలాగే భారత్-ఎ తరపున కూడా రాణించలేకపోయాడు. దీంతో పేస్‌కు అనుకూలించే న్యూజిలాండ్ పిచ్‌లపై స్పెషలిస్ట్ కీపర్ కన్నా ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్ అవసరమని భావించిన కోహ్లీ.. పంత్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

మిక్స్‌డ్ రియాక్షన్స్..

అయితే ఈ నిర్ణయాన్ని కొందరూ ఆహ్వానించగా మరికొందరూ తప్పబడుతున్నారు. అలాగే పంత్‌కు అవకాశం రావడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫన్నీ కామెంట్లు, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

చెత్త నిర్ణయమని

‘ప్రతీ ప్రివ్యూలో సాహానే కీపర్ అన్నారు.. కానీ మ్యాచ్‌లో మాత్రం పంత్‌ వచ్చాడు.'అని ఒకరు కామెంట్ చేయగా.. జట్టు సాహా లేకపోవడం నిరాశ కలిగించిందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు కోహ్లీ తీసుకున్న చెత్త నిర్ణయమని మండిపడ్డారు. ‘సాహా స్వదేశంలో.. పంత్ విదేశంలోనా? పంత్ ఎప్పుడూ అంచనాలను అందుకోడు.. కోహ్లి ఎప్పుడూ రోహిత్ ఫ్యాన్స్‌ను నిరాశపరచడు.. 'అని మరోకరు కామెంట్ చేశారు.

పంత్ సెంచరీ పక్కా..

మరోవైపు పంత్ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పంత్ ఆడటం అస్సలు నమ్మలేకపోతున్నా.. నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా' అని ఒకరంటే.. పంత్ సెంచరీ చేస్తాడని మరొకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఖరికి అవకాశం వచ్చింది పంత్.. నువ్వెంటో నిరూపించుకో.. అని ఇంకొకరు సూచిస్తున్నారు. పరిమిత ఓవర్లలో పంత్ కన్న బెస్ట్ బ్యాట్స్‌మన్ రాహుల్.. టెస్టుల్లో సాహా కన్నా బెస్ట్ పంత్.. అంతే అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

భారత్ 122/5

భారత్ 122/5

ఇక వర్షం అంతరాయంతో తొలి రోజు ఆట అర్ధాంతరంగా ముగియగా.. ఆట ముగిసే సమయానికి భారత్ 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే (38 బ్యాటింగ్), రిషభ్ పంత్(10 బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను అరంగేట్ర బౌలర్ కైలీ జేమీసన్ దెబ్బతీశాడు. పుజారా(11), విరాట్ కోహ్లీ(2) విహారి(7)ను పెవిలియన్‌కు చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు. పృథ్వీషా(16)ను టీమ్ సౌథీ ఔట్ చేయగా.. మయాంక్ అగర్వాల్(38) బౌల్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 101 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రహానే-పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

Story first published: Friday, February 21, 2020, 13:24 [IST]
Other articles published on Feb 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X