న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధావన్‌(వీడియో)

 Twist in Dhawan batting, ball thrown himself

హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‍‌ను 287 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఇదిలా ఉండగా, టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ధావన్ అప్పుడే ఔటయ్యేవాడు:

ధావన్ అప్పుడే ఔటయ్యేవాడు:

జేమ్స్‌ అండర్సన్‌ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతిని గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. తొలుత ధావన్‌ బ్యాట్‌ను తాకిన ఆ బంతి ప్యాడ్లపై జారుకుంటూ కింద పడింది. అయితే డేంజర్‌ జోన్‌లో పడిన సదరు బంతి వికెట్లపైకి సమీపిస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధావన్‌.. చాకచక్యంగా వ్యవహరించి బ్యాట్‌తో పక్కకు గెంటేశాడు. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ అప్పుడే ఔటై ఉంటే మాత్రం తన ఎంపికను ప్రశ్నిస్తున్నవారి నోటికి మరింత పని కల్పించేవాడు ధావన్‌.

 287 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆలౌట్:

287 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆలౌట్:

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు స్యామ్‌ కరన్‌(24) చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆఖరి వికెట్‌ను మొహమ్మద్ షమీ సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మలకు తలోవికెట్‌ దక్కింది.

స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి

తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కుక్‌ (0) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు సాధించింది. మ్యాచ్‌లో భారత్‌ ఇంకా నిలిచింది అంటే, ఇంకా ఆశలు కోల్పోలేదంటే కారణం ఒకే ఒక్కడు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి! ఓ వైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు ఒత్తిడి తెస్తున్నా.. వికెట్లు పోతున్నా అతడు సహనంగా నిలబడ్డాడు. జట్టు స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి స్వింగ్‌ను, సీమ్‌ను జాగ్రత్తగా గమనిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు.

 150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో

150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో

అండర్సన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ (10), షమి (2) కొద్ది తేడాలో ఔటైనా కోహ్లి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఇషాంత్‌ 17 బంతుల్లో (5) తో తొమ్మిదో వికెట్‌కు విలువైన 35 పరుగులు జోడించాడు. ఇషాంత్‌ ఔటైనా ఉమేశ్‌ అండగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్టోక్స్‌ బంతిని పాయింట్‌ దిశగా బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. తర్వాతి బంతికి మిడాన్‌ దిశగా బౌండరీ రాబట్టాడు. అదే దూకుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరికి 150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో వెనుదిరిగాడు.

Story first published: Friday, August 3, 2018, 11:38 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X