న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలసిపోకుండా!: వార్నర్-బెయిర్ స్టో భాగస్వామ్యంపై సచిన్ ట్వీట్, వైరల్

Truly remarkable: Sachin Tendulkar hails record-breaking Warner-Bairstow partnership as extraordinary

హైదరాబాద్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుతో ఆదివారం సాయంత్రం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో నెలకొల్పిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యంపై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్ రైజర్స్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో "వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పటికీ అలసిపోకుండా, వికెట్ల మధ్య చకాచకా పరుగులు తీస్తూ, అద్బుతమైన క్రికెటింగ్‌ షాట్లు ఆడుతూ మరిచిపోలేని భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పారు" అని ట్వీట్ చేశాడు.

ఐపీఎల్‌‌లో వార్నర్‌‌కు ఇది నాలుగో సెంచరీ

ఐపీఎల్‌‌లో వార్నర్‌‌కు ఇది నాలుగో సెంచరీ

ఈ మ్యాచ్‌లో వార్నర్, బెయిర్ స్టో సెంచరీలు సాధించడంతో సొంతగడ్డపై వరుసగా సన్‌రైజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌‌లో వార్నర్‌‌కు ఇది నాలుగో సెంచరీ కాగా... మూడు సెంచరీలు ఇదే మైదానంలో సాధించడం విశేషం. తాజా సెంచరీతో వార్నర్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.

బెయిర్‌ స్టో ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ

మరోవైపు ఈ మ్యాచ్‌లో 114 పరుగులు చేసిన బెయిర్‌ స్టో ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ. ఈ క్రమంలో ఐపీఎల్‌లో బెయిర్ స్టో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 114 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడవ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

విజయ పరంపర కొనసాగిస్తామన్న లక్ష్మణ్

గతంలో ఐపీఎల్‌లో కెవిన్ పీటర్సన్(2012), బెన్ స్టోక్స్(2017)లో సెంచరీలను నమోదు చేశారు. మరోవైపు తమ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని, మహ్మద్‌ నబీ, సందీప్‌లు బౌలింగ్‌లో రాణించడంతో బెంగుళూరును తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగామని, సీరిస్‌ మొత్తం ఇలాగే విజయ పరంపర కొనసాగిస్తామని సన్‌రైజర్స్‌ మెంటార్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, April 1, 2019, 15:50 [IST]
Other articles published on Apr 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X