న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్క శర్మను టార్గెట్ చేసిన ట్రోలర్స్.. చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్లే ఇలాంటి ట్రోల్స్ చేస్తారంటూ..

trollers target on anushka sharma

మూడు సంవత్సరాలకు పైగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయని విరాట్ కోహ్లీ.. పేలవ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని ఎదుర్కొనే క్రమంలో వరుస మ్యాచ్‌లలో తొలి బంతికే డకౌట్ అయిన కోహ్లీ ప్రదర్శనపై అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రముఖ క్రికెటర్లు సైతం కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో కేవలం 19.83సగటుతో 119పరుగులు మాత్రమే కోహ్లీ చేశాడు. 2009నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో కోహ్లీకి ఇదే అత్యంత చెత్త సగటు. ఈ క్రమంలో కోహ్లీ హేటర్స్ అతనిపై ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు కోహ్లీ వైఫ్ అనుష్క శర్మపై కూడా ట్రోల్స్ మొదలెట్టారు. కోహ్లీ పేలవ ఫామ్‌కు అనుష్కను టార్గెట్ చేస్తూ ట్విట్టరులో పోస్టులు పెడుతున్నారు.

కోహ్లీ ఆ ఒక్క డిసిషన్ నీ పతనానికి కారణం..

ఓ నెటిజన్ ట్విట్టరులో దుమారం రేపే పోస్టు చేసింది. కోహ్లీ నీ జీవితంలో నువ్వు తీసుకున్న ఆ ఒక్క డిసిషన్ నీ పతనానికి కారణమైందంటూ.. కోహ్లీ, అనుష్క వివాహ ఫోటోను షేర్ చేసింది. ఇంకో నెటిజన్.. ఒక్క ఏడాదిలోనే ఐసీసీ అన్ని అవార్డులను గెలుపొందిన కోహ్లీ.. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం అది నిజమా జోకా అనేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనికి అంతటికీ కారణం కోహ్లీ వెనకాల ఉన్న ఆమెనే అంటూ అనుష్క ఫోటోను పోస్ట్ చేశాడు. కోహ్లీ ఫామ్ కోల్పోవడానికి ఎవరు కారణమై ఉంటారు అనే ఓ క్వశ్చన్‌తో ఓ నెటిజన్ పోస్ట్ పెట్టగా.. దానికి రిప్లేగా అనుష్క శర్మ అంటూ కామెంట్లొస్తున్నాయి.

చీప్ మెంటాలిటీ..

కోహ్లీ సరిగా ఆడకపోవడానికి కారణం అనుష్క అంటూ ట్రోల్స్ చేస్తున్నవారిని ఉద్దేశించి.. మరికొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్లే ఇలాంటి ట్రోల్స్ చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. 2017లో విరాట్ కోహ్లీ మ్యారేజీ అయింది. తర్వాత రెండేళ్లు కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అప్పుడు లేనిది సడెన్‌గా ఇప్పుడు కోహ్లీ ఫామ్ కోల్పోవడానికి అనుష్క కారణమని పేర్కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ స్పందిస్తున్నారు. ఈ సొసైటీలో చాలామందికి మగవాళ్లు డౌన్ ఫాల్ అయితే దానికి కారణంగా ఆడవాళ్లను చూపించడానికి ఆసక్తి చూపుతారు.. ఎందుకంటే ఆడవాళ్లను వేలెత్తి చూపడం చాలా ఈజీ వాళ్లకు అంటూ ఓ నెటిజన్ అనుష్కకు సపోర్ట్‌గా కామెంట్ చేసింది.

వరుసగా నిరాశజనకంగా..

ఐపీఎల్లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మార్కో జాన్సన్ వేసిన స్వింగ్ డెలివరీకి స్లిప్ క్యాచ్‌గా ఔటయ్యాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో కూడా కోహ్లీ గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో 14ఏళ్ల తన కెరీర్‌లో తొలిసారి బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ డక్ రికార్డును నమోదుచేశాడు. ఈ సీజన్లో 41, 12, 5, 48, 1, 12, 0, 0లతో నిరాశజనక ప్రదర్శనతో కోహ్లీ ఏమాత్రం ఆకట్టుకోవట్లేదు. కోహ్లీ త్వరలోనే పుంజుకుంటాడంటూ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు.

Story first published: Sunday, April 24, 2022, 18:46 [IST]
Other articles published on Apr 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X