న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లెండిల్ సిమ్మన్స్, డారెన్ బ్రావో సిక్సుల వర్షం.. సీపీఎల్ 2020 విజేత ట్రిన్‌బాగో నైట్ రైడర్స్!!

TKR vs SLZ: Trinbago Knight Riders win CPL 2020

తరౌబా (ట్రినిడాడ్): కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్ విజేతగా కీరన్ పోలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. సెయింట్ లూసియా జూక్స్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో ట్రిన్‌బాగో ఖాతాలో నాలుగో టైటిల్ చేరింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (84 నాటౌట్; 49 బంతుల్లో 8x4, 4x6), స్టార్ బ్యాట్స్‌మన్‌ డారెన్ బ్రావో (58 నాటౌట్; 47 బంతుల్లో 2x4, 6x6) సిక్సుల వర్షం కురిపించడంతో ట్రిన్‌బాగో సునాయాస విజయాన్ని అందుకుంది.

సిమ్మన్స్ మాత్రం:

సిమ్మన్స్ మాత్రం:

155 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు శుభారంభం దక్కలేదు. టియోన్ వెబ్‌స్టర్ (5) నెమ్మదిగా ఆడి పెవిలియన్ చేరాడు. టిమ్ సీఫెర్ట్ (4) కూడా ఔట్ అవ్వడంతో సెయింట్ లూసియా జూక్స్ బృందంలో ఆనందం వెల్లువిరిసింది. ఇక క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో కూడా పరుగులు చేయలేక తడబడ్డారు. సెయింట్ లూసియా స్పిన్ బౌలర్లు బ్రావోను అడ్డుకున్నారు. దీంతో ట్రిన్‌బాగో స్కోర్ బోర్డు ముందుకు సాగలేదు. అయితే సిమ్మన్స్ మాత్రం వేగంగానే ఆడాడు.

మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన బ్రావో:

మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన బ్రావో:

10 ఓవర్లు ముగిసేసరికి ట్రిన్‌బాగో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులే చేసింది. అప్పటికి చేయాల్సిన రన్ రేట్ 10గా మారింది. 11 ఓవర్లో డారెన్ బ్రావో ఓ సిక్స్ బాదగా.. 12వ ఓవర్లో లెండిల్ సిమ్మన్స్ సిక్స్, ఫోర్ బాది స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఇక 14వ ఓవర్లో బ్రావో రెండు సిక్సులు బాదినా.. చేయాల్సిన రన్స్ ఇంకా చాలానే ఉన్నాయి. 16 ఓవర్ ముగిసేసరికి కూడా అందరూ సెయింట్ లూసియానే విజయం సాధిస్తుంది అనుకున్నారు. 17వ ఓవర్ ఏకంగా మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. ఈ ఓవర్లో సిమ్మన్స్, బ్రావో కలిసి ఏకంగా 23 పరుగులు పిండుకున్నారు.

సిక్సులతో విరుచుకుపడ్డ బ్రావో:

సిక్సులతో విరుచుకుపడ్డ బ్రావో:

18వ ఓవర్లో కూడా లెండిల్ సిమ్మన్స్, డారెన్ బ్రావోలు 16 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ ట్రిన్‌బాగో చేతుల్లోకి వచ్చింది. ఆదిలో నెమ్మదిగా ఆడిన బ్రావో సిక్సులతో విరుచుకుపడి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు సిమ్మన్స్ కూడా అర్ధ సెంచరీ అనంతరం గేర్ మార్చి మరింత వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ 130కి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి ధాటికి ట్రిన్‌బాగో 18.1 ఓవర్లోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిమ్మన్స్ దక్కించుకున్నాడు.

ఆదుకున్న ఫ్లెచర్:

ఆదుకున్న ఫ్లెచర్:

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూసియా జూక్స్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రకీమ్ కార్న్‌వాల్ (8) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో మార్క్ డీయల్ (29), ఆండ్రీ ఫ్లెచర్ (39) సెయింట్ లూసియా స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆపై డీయల్‌ను ఫవాద్ అహ్మద్.. ఫ్లెచర్‌ను పోలార్డ్ పెవిలియన్ చేర్చారు. ఇక రోస్టన్ చేజ్ (22), నజీబుల్లా జద్రాన్ (24) స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు.

4 వికెట్లతో రెచ్చిపోయిన పోలార్డ్:

4 వికెట్లతో రెచ్చిపోయిన పోలార్డ్:

అయితే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ చెలరేగడంతో చేజ్, జద్రాన్ పెవిలియన్ చేరారు. ఇక్కడి నుంచి సెయింట్ లూసియా బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. స్టార్ ప్లేయర్ మొహమ్మద్ నబీ (2) పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్ డారెన్ సామీ (8) రాగానే ఓ సిక్సర్ బాదినా.. ఆపై మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ జూపించలేకపోయాడు. ట్రిన్‌బాగో బౌలర్ల ధాటికి జావెల్లె గ్లెన్ (9), కేస్రిక్ విలియమ్స్ (3), జహీర్ ఖాన్ (0) పరుగులు చేయలేకపోయారు. కుగ్గెలీజ్న్ (2) నాటౌట్‌గా ఉన్నాడు. ట్రిన్‌బాగో బౌలర్లలో పోలార్డ్ 4, అలీ ఖాన్ 2, ఫవాద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.

ఏడు నెలల తర్వాత.. భర్త షోయబ్ మాలిక్‌ని కలిసిన సానియా మీర్జా!!

Story first published: Friday, September 11, 2020, 8:11 [IST]
Other articles published on Sep 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X