న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉల్లిగడ్డపై ట్రెంట్ బోల్ట్ ఆటోగ్రాఫ్.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ (వైరల్ వీడియో)

Trent Boult obliges weird request from fans, gives autograph on onion

క్రైస్ట్‌చర్చ్: భారత్-న్యూజిలాండ్ మధ్య సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే.. ఎవరైనా ఆటోగ్రాఫ్.. బుక్, పేపర్, క్యాప్, టీ షర్ట్, బ్యాట్.. ఇలా వారికి సంబంధించిన వస్తువులపై తీసుకుంటారు. అవి లేకుంటే చేతిపైనో లేకుంటే అందుబాటులో ఉన్న వస్తువుపైనో సైన్ చేయించుకుంటారు.

కానీ ఓ న్యూజిలాండ్ అభిమానిని చాలా విచిత్రంగా ఉల్లిగడ్డపై తన అభిమాన పేసర్ అయిన ట్రెంట్ బోల్ట్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. భారత్ బ్యాటింగ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బౌల్ట్.. ఫ్యాన్స్ కోరిక మేరకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఈ సందర్బంగా ఓ అభిమాని ఉల్లిగడ్డ చూపిస్తూ ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాడు. దీనికి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసిన బోల్ట్ తన అభిమాని కోరిక నేరవేర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. భారత్‌లో ఉల్లిగడ్డ ధరపై సెటైర్సా? అని అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

భారత్ పతనాన్ని శాసించిన బౌల్ట్..

భారత్ పతనాన్ని శాసించిన బౌల్ట్..

రెండు టెస్ట్‌లో సిరీస్‌లో బౌల్ట్ భారత్ పతనాన్ని శాసించాడు. గాయం తర్వాత ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ పేసర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 11 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌథీ(14) తొలి స్థానంలో నిలవగా బోల్ట్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లోను అదరగొట్టాడు. వెల్లింగ్టన్ టెస్ట్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ ఆజాజ్ పటేల్(4) చివరి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

అందుకే కోహ్లీ విఫలం..

అందుకే కోహ్లీ విఫలం..

ఇక ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా తేలిపోవడానికి గల కారణాలను బౌల్ట్ చెప్పుకొచ్చాడు. ‘కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. మాకు అతడి వికెట్‌ ఎంతో కీలకం. అందుకే అతడిపై ఒత్తిడి పెరిగేలా ప్రయత్నించాం. లయ తప్పకుండా బంతులు వేస్తూ బౌండరీలు సాధించకుండా కట్టడి చేశాం. అంతేకాక అతడు పొరపాట్లు చేసేలా పురిగొల్పాం. మొత్తంగా అదృష్టవశాత్తు మంచి బంతులతో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాం. కోహ్లీ ఎంత తొందరగా పెవిలియన్‌కు చేరితే మాలో విశ్వాసం మరింత పెరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు.

నెమ్మదైన పిచ్‌లు..

నెమ్మదైన పిచ్‌లు..

ఇక భారత్‌లో నెమ్మదైన పిచ్‌లపై ఆడటం కూడా భారత జట్టుకు ప్రతికూలంగా మారిందన్నాడు. ‘భారత్‌లో వారు ఎక్కువగా నెమ్మది పిచ్‌లపై ఆడుతుంటారు. దీంతో ఇక్కడి పిచ్‌లపై అలవాటు పడాలంటే సమయం పడుతుంది. భారత్‌లో బౌలింగ్‌ చేయాలన్నా నాకు అలానే ఉంటుంది. అయితే రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. ఇది టెస్టు క్రికెట్‌లో రికార్డో కాదో నాకు తెలియదు. కానీ బౌలర్లు ఎంతో గొప్పగా బౌలింగ్‌ చేశారు. మొత్తంగా మేం రెండో టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచాం'' అని బౌల్ట్‌ పేర్కొన్నాడు.

Story first published: Monday, March 2, 2020, 16:22 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X