న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ మెయిల్ ఎలా లీక్ అయిందో? ప్రశ్నించిన అమితాబ్

BCCI Officials Demands On Slip Of Mithali Raj Email | Oneindia Telugu
Top BCCI Official Demands Answers On Leak Of Mithali Rajs Email

హైదరాబాద్: మహిళా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మిథాలీని తప్పించడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తన ఆవేదనను వెల్లగక్కుతూ మిథాలీ బీసీసీఐకి లేఖ రాసింది. దానిని మెయిల్ ద్వారా పంపింది. అయితే గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఎందుకు లీక్ అయింది. ఆమె మెయిల్ ఎవరెవరికీ పంపింది అనే కోణంలో బీసీసీఐ విచారణ చేపట్టనుంది. కోచ్ రమేశ్ పవార్‌, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌లో సభ్యురాలైన డయానా ఎడుల్జీ తనను ఎలా అవమానించారనే ఆవేదనను బహిర్గతం చేసింది.

లేఖ బహిర్గతం కావడాన్ని బీసీసీఐ సీరియస్‌గా

లేఖ బహిర్గతం కావడాన్ని బీసీసీఐ సీరియస్‌గా

అదంతా వివరిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ, జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌) సబా కరీమ్‌కు మిథాలీ మెయిల్‌ రూపంలో సుదీర్ఘమైన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లేఖ బహిర్గతం కావడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. మిథాలీ రాసిన ఈ-మెయిల్‌ లేఖ ఎలా లీక్‌ అయిందో వివరణ ఇవ్వాలంటూ జోహ్రీ, సబా కరీమ్‌కు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌధరి బుధవారం ఈ-మెయిల్‌ చేశారు.

మిథాలీ ఎవరెవరికి పంపిందోనని విచారణ

మిథాలీ ఎవరెవరికి పంపిందోనని విచారణ

‘మీకు మిథాలీ లేఖ రాసిన ఈ-మెయిల్‌ సారాంశం బహిర్గతమైందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వస్తున్నాయి. సదరు మెయిల్‌ను మిథాలీ ఎవరెవరికి పంపిందో సదరు లేఖ కాపీలను తక్షణమే నాకు పంపండి' అని జోహ్రీ, సబా కరీమ్‌లకు పంపిన మెయిల్‌లో అమితాబ్‌ పేర్కొన్నాడు. ఈ ఉదంతంతో ఇప్పుడు కొందరు వ్యక్తులతో పాటు బీసీసీఐకి కూడా నష్టం వాటిల్లే ప్రమాదముందనీ.. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నట్టు కూడా అమితాబ్‌ ఆ మెయిల్‌లో కోరినట్టు సమాచారం.

మిథాలీకి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం, జట్టును పట్టించుకోదు: రమేశ్ పొవార్

మిథాలిని తప్పించినందుకు వివరణ ఇస్తూ:

మిథాలిని తప్పించినందుకు వివరణ ఇస్తూ:

ఆ మెయిల్‌లో మిథాలీ చేసిన ప్రశ్నలకు ఆమె ఆవేదనకు కోచ్ రమేశ్ పవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిథాలీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో పొవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో మిథాలీని తప్పించడంతో పాటు జట్టు గెలుపొటములకు సంబంధించిన నివేదికను కోచ్ పవార్ బీసీసీఐకి సమర్పించాడు. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీంతో బుధవారం ముంబైలో సమావేశమైన రమేశ్.. 10 పేజీల నివేదికను అందజేశాడు.

Story first published: Thursday, November 29, 2018, 11:20 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X