న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌ని గెలిపించలేకపోయిన టాప్-5 సెంచరీలు

Top 5 knocks that went in vain in cricket World Cup

హైదరాబాద్: వరల్డ్‌కప్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది విన్నర్లు. దీంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అయితే, కొందరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టుని గెలిపించలేకపోతారు. గత వరల్డ్‌కప్‌ల్లో ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూశాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1991 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో మార్టిన్ క్రోయి(91) పరుగుల నుంచి 2011 వరల్డ్‌కప్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (111) పరుగుల వరకు ఇలా ఎన్నో... తాజా వరల్డ్‌కప్ నేపథ్యంలో గత వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసినప్పటికీ... జట్టుని మాత్రం విజయం వైపు నడిపించని సందర్భాలను ఒక్కసారి చూద్దాం...

2011: సచిన్ టెండూల్కర్ (నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 111)

2011: సచిన్ టెండూల్కర్ (నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 111)

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్(111), వీరేంద్ర సెహ్వాగ్(73) పరుగులతో భారత్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చారు. సెహ్వాగ్ తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరినప్పటికీ... ఆ తర్వాత గంభీర్‌(69)తో కలిసి సచిన్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. దీంతో సచిన్ 101 బంతుల్లో 111 పరుగులు చేశాడు. సచిన్ ఔటైన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 296 పరుగులకే పరిమితమైంది. అనంతరం 297 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సఫారీలు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచ్‌లో 50/5 రాణించిన డేల్ స్టెయిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో సచిన్ సెంచరీ వృధా అయింది.

2011: మహిళా జయవర్దనే(ముంబైలో టీమిండియాపై 103 నాటౌట్)

2011: మహిళా జయవర్దనే(ముంబైలో టీమిండియాపై 103 నాటౌట్)

ఇది వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్. వాంఖడె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ మహిళా జయవర్దనే 88 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేధనలో ఓపెనర్ గౌతమ్ గంభీర్(97), ధోని(91 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో జయవర్దనే సెంచరీ వృథా అయింది.

1992: అజహరుద్దీన్ (బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 93)

1992: అజహరుద్దీన్ (బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై 93)

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అలెన్ బోర్డర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో జోన్స్(90), బూన్(43) పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ ఆరంభించే సమయానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం తగ్గిన తర్వాత టీమిండియా విజయ లక్ష్యాన్ని 47 ఓవర్లకు గాను 236 పరుగులుగా నిర్ధారించారు. చేధనలో రవిశాస్త్రి(67 బంతుల్లో 25) పరుగులు మ్యాచ్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత అజహరుద్దీన్(102 బంతుల్లో 93) పరుగులతో దూకుడుగా ఆడినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు. 47 ఓవర్లకు గాను టీమిండియా 234 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఒక పరుగు తేడాతో ఆసీస్ నెగ్గింది. అయితే, అజహరుద్దీన్ ఇన్నింగ్స్ ఇప్పటికీ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా కొనియాడబడుతుంది.

2003: స్కాట్ స్టైరిస్ (శ్రీలంకపై 141)

2003: స్కాట్ స్టైరిస్ (శ్రీలంకపై 141)

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సనత్ జయసూర్య (125 బంతుల్లో 120) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్‌ను స్కాట్ స్టైరిస్ తన సెంచరీతో ఆదుకున్నాడు. No.4 స్థానంలో క్రీజులోకి వచ్చిన No.4 చివరి వరకు క్రీజులో నిలిచి 125 బంతుల్లో 141 పరుగులు చేసి న్యూజిలాండ్‌ను గెలిపించేంత పనిచేశాడు. అయితే, జట్టులోని మిగతా సభ్యుల నుంచి అతడికి సరైన సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

1999: నైల్ జాన్సన్ (లార్డ్స్‌లో ఆస్ట్రేలియాపై 132 నాటౌట్)

1999: నైల్ జాన్సన్ (లార్డ్స్‌లో ఆస్ట్రేలియాపై 132 నాటౌట్)

చాలా మంది అభిమానులను ఈ మ్యాచ్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్యాంప్‌బెల్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో మార్క్ వా(104), స్టీవ్ వా(62) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. అనంతరం చేధనలో జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో జాన్సన్ (144 బంతుల్లో 132) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జాన్సన్ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.

Story first published: Tuesday, May 28, 2019, 13:20 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X