న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జడేజాను ఎందుకు పరీక్షించలేదు.. భారత్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ లొసుగును వాడుకుంది'

Tom Moody and Michael Vaughan raised questions on Ravindra JadejaS concussion replacement

కాన్‌బెర్రా: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా టీమిండియా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీ20ల్లో తొలి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌‌గా చహల్ చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా హెల్మెట్‌కు బంతి తగలడంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన చహల్.. కీలకమైన ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్‌ వికెట్లను పడగొట్టాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా కూడా నిలిచాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్ చహల్ కావడం విశేషం.

'జడేజాను ఎందుకు పరీక్షించలేదు:

'జడేజాను ఎందుకు పరీక్షించలేదు:

రవీంద్ర జడేజాకు బదులు యుజ్వేంద్ర చహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై క్రికెట్‌ వర్గాల్లో వివాదం నెలకొంది. కంకషన్‌ నిబంధనలకు కట్టుబడే భారత్‌ వ్యవహరించిందని పలువురు మాజీలు పేర్కొంటుండగా.. మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం హెల్మెట్‌కు బంతి తాకిన వెంటనే సదరు ఆటగాణ్ని చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ జడేజా హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీ బారిన పడినప్పుడే ఫిజియో వచ్చి పరీక్షించి వెళ్లాడు. ఇదే విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ ప్రస్తావించాడు. హెల్మెట్‌కు బంతి తాకినప్పుడు జడేజాను పరీక్షించడానికి డాక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. అది ప్రోటోకాల్ కదా అని గుర్తు చేశాడు.

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ లొసుగును వాడుకుంది:

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ లొసుగును వాడుకుంది:

'జడేజా స్థానంలో చహల్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని జడేజా హెల్మెట్‌కు బంతి తగిలినప్పుడు వైద్యుడు, ఫిజియో మైదానంలోకి రాకపోవడం నిబంధనల్ని పాటించినట్లే అవుతుందా?' అని టామ్‌ మూడీ ప్రశ్నించాడు. 'జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అవసరమనడానికి వైద్యుడు లేదా ఫిజయో మైదానంలో అతడిని పరీక్షించలేదు. అంతకుముందు జడేజా కాలికి సంబంధించి ఏదో చేయించుకున్నట్లు కనిపించింది. ఇన్నింగ్స్‌ అనంతరం కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను బరిలో దించారు' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ వ్యాఖ్యానించాడు. భారత్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ లొసుగును వాడుకుందని పేర్కొన్నాడు.

హల్‌ను తీసుకోవడం సరైందే:

హల్‌ను తీసుకోవడం సరైందే:

టీంఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. 'ఈ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ఆస్ట్రేలియన్‌. అతడా జట్టుకు మాజీ ఆటగాడు కూడా. జడేజాకు బదులు చహల్‌ సబ్‌స్టిట్యూట్‌గా రావడాన్ని ఆయన స్వాగతించారు. ఇక చహల్‌ స్పెషలిస్టు స్పిన్నర్‌ అని వాదించొచ్చు. కానీ జడేజా సైతం బౌలింగ్ చేయగలడు కాబట్టి చహల్‌ను తీసుకోవడం సరైందే. మ్యాచ్‌ రిఫరీ కూడా దాన్ని అంగీకరించాక దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు' అని సన్నీ అన్నాడు.

మంజ్రేకర్‌, సెహ్వాగ్‌, ఓజాలు ఏమన్నారంటే:

మంజ్రేకర్‌, సెహ్వాగ్‌, ఓజాలు ఏమన్నారంటే:

'జడేజా తలకు బంతి తగిలిన సమయంలో ఫిజియో రాకపోవడం నిబంధనలకు విరుద్ధం. వైద్యులు అక్కడికి చేరుకొని బ్యాట్స్‌మన్‌ను పరిశీలించాలి. అతడికి ఎలా ఉందనే విషయాలు తెలుసుకోవాలి. కానీ జడేజా విషయంలో ఇదేం జరగలేదు. కాసేపట్లోనే అతడు తిరిగి బ్యాటింగ్‌ చేశాడు. ఒకవేళ వైద్యులు అతడిని పరిశీలించి ఉంటే టీమిండియాకు బాగుండేది. మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌.. చహల్‌ను అంగీకరించక తప్పలేదు' అని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.

'తలకు గాయమైతే లక్షణాలు వెంటనే కనిపించవు. 24 గంటల తర్వాత కూడా దాని ప్రభావం ఉండొచ్చు. జడేజా డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లాక తలపై వాపు కనిపించిందేమో. ఇంతకుముందు స్మిత్‌ తలకు బౌన్సర్‌ తాకితే.. అతడి స్థానంలో ఆస్ట్రేలియా లబుషేన్‌ను ఆడించింది' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తుచేశాడు.

'కంకషన్‌ నిబంధనలకు లోబడే టీమ్‌ఇండియా ఆడింది. నిబంధనల ప్రకారం ఆడితే అది కచ్చితంగా ఆమోదించాల్సిన విషయమే' అని ప్రజ్ఞాన్‌ ఓజా పేర్కొన్నాడు.

టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ.. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్!!

Story first published: Saturday, December 5, 2020, 12:24 [IST]
Other articles published on Dec 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X