న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ.. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్!!

India vs Australia: Ravindra Jadeja Ruled Out Of T20I Series, Shardul Thakur Added

కాన్‌బెర్రా: శుక్రవారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ (కంకషన్) స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. మిగితా రెండు మ్యాచ్‌ల‌కు దూరమయ్యాడు. జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకున్నామని టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం రెండో టీ20, మంగళవారం చివరి టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఇక డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

జడేజా స్థానంలో ఠాకూర్:

జడేజా స్థానంలో ఠాకూర్:

ర‌వీంద్ర జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకున్నామని బీసీసీఐ పేర్కొంది. జాడేజాను ఇంకా అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టామ‌ని, అవ‌స‌రం అయితే మ‌రిన్ని స్కాన్స్ చేస్తామ‌ని తెలిపింది. డ్రెస్సింగ్ రూమ్‌లో బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ జ‌రిపిన క్లినిక‌ల్ డ‌యాగ్న‌సిస్ ద్వారా జ‌డేజా కాంక‌ష‌న్‌కు గురైన‌ట్లు తేల్చారు. కాన్‌బెర్రాలో జ‌రిగిన తొలి టీ20లో జ‌డేజా కీల‌క పాత్ర పోషించాడు. కేవ‌లం 23 బంతుల్లో 44 ర‌న్స్ చేసి భార‌త్ భారీ స్కోర్‌ను అందించాడు. జ‌డేజా హిట్టింగ్ టీమిండియా విక్ట‌రీలో కీల‌కంగా నిలిచింది. అయితే జ‌డేజా స్థానంలో కాంక‌ష‌న్ ప్లేయ‌ర్‌గా ఆడిన యుజ్వేంద్ర చహ‌ల్ కూడా రాణించాడు. 25 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు.

కంకషన్‌కు గురైయ్యాడు:

కంకషన్‌కు గురైయ్యాడు:

తొలి టీ20లో ఇన్నింగ్స్ చివరలో మిచెల్ స్టార్క్ వేసిన బౌన్సర్‌ని ఫుల్ చేసేందుకు రవీంద్ర జడేజా ప్రయత్నించగా.. బ్యాట్‌కి సరిగ్గా కనెక్ట్ కాని బంతి నేరుగా వెళ్లి అతడి హెల్మెట్‌ని బలంగా తాకింది. దీంతో అతడు కంకషన్‌కు గురైయ్యాడు. చికిత్స అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జడేజా స్థానంలో చహల్‌ మైదానంలోకి వచ్చాడు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చహల్‌ బంతితో మాయ చేశాడు.

తొడ కండరాలకీ గాయమైంది:

తొడ కండరాలకీ గాయమైంది:

వాస్తవానికి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తొడ కండరాలకీ గాయమైంది. అయితే ఫిజియో సాయం తీసుకున్న జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) అలానే చివరి వరకూ బ్యాటింగ్‌ని కొనసాగించాడు. మధ్యలో బంతి హెల్మెట్‌ని బలంగా తాకినా.. అతను వెనక్కి తగ్గలేదు. కానీ కాంకషన్‌కి గురైన జడేజాకి మరిన్ని పరీక్షలు అవసరమని వైద్యులు సూచించడంతో.. మిగిలిన రెండు టీ20లకి అతను దూరమయ్యాడు.

ఐసీసీ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం:

ఐసీసీ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం:

ఐసీసీ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఓ ప్లేయ‌ర్‌కు కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్‌ను ఇవ్వాలంటే అత‌నికి వెంట‌నే టెస్ట్ నిర్వ‌హించాలి. ఆ త‌ర్వాత అత‌డు ఆడకూడ‌దు. అయితే జ‌డేజాకు మాత్రం గాయ‌మైన స‌మ‌యంలో కాంక‌ష‌న్ టెస్ట్ నిర్వ‌హించ‌లేదు. ఆ త‌ర్వాత కూడా అత‌ను బ్యాటింగ్ కొన‌సాగించి 3 బంతుల్లో 9 ప‌రుగులు చేశాడు. ఇక జడేజా స్థానంలో చహల్ రావడంపై ఆస్ట్రేలియా కోచ్‌ లాంగర్, కెప్టెన్ అరోన్ ఫించ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌తో గొడవకి దిగారు.

ISL 2020 21: సునీల్‌ ఛెత్రీ గోల్‌.. బెంగళూరు బోణీ

Story first published: Saturday, December 5, 2020, 11:17 [IST]
Other articles published on Dec 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X