న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై భారత్ టెస్టు సిరిస్ గెలవాలంటే!: కోహ్లీకి మద్దతు తప్పనిసరి

To win Test series, other Indian batsmen need to support Virat Kohli: Adam Gilchrist

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మద్దతుగా నిలబడాలని ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ సూచించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ "2014 తరహాలోనే ఆస్ట్రేలియా పిచ్‌లపై విరాట్ కోహ్లీ చెలరేగే అవకాశం ఉంది. ఇటీవలే అతనితో స్వయంగా నేను మాట్లాడాను. ఆ సమయంలోనే అతని ఆత్మవిశ్వాసం గతంలో కంటే రెట్టింపై ఉండటాన్ని గమనించాను. సిడ్నీ టీ20లోనూ విరాట్ కోహ్లీ భారత్‌ని గెలిపించిన విధానం మనం అందరం చూశాం" అని అన్నాడు.

టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు గెలవాలంటే

టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు గెలవాలంటే

"ఇక టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు గెలవాలంటే మాత్రం కోహ్లీకి అతని టీమ్‌లోని బ్యాట్స్‌మెన్ మద్దతు తప్పనిసరి. అలానే బౌలర్లు కూడా మ్యాచ్‌ని కాపాడేందుకు ప్రయత్నించాలి. కోహ్లీ ఫామ్ చూస్తుంటే, ఒకవేళ టెస్టుల్లో అతను విఫలమైతే అది ఆశ్చర్యమే" అని గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.

తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా

తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా

బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా రెండో టీ20 రద్దైంది. సిడ్ని వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే.

నాలుగు టెస్టుల్లో 86.50 సగటుతో

నాలుగు టెస్టుల్లో 86.50 సగటుతో

ఆసీస్ గడ్డపై 2014-15లో ఆఖరిసారి టెస్టు సిరీస్ ఆడిన విరాట్ కోహ్లి.. ఆడిన నాలుగు టెస్టుల్లో 86.50 సగటుతో ఏకంగా 694 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అయితే, ఆ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్‌ని గెలవలేకపోయింది. తాజా పర్యటనలోనూ కోహ్లీ రాణిస్తాడని గిల్‌క్రిస్ట్ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, November 27, 2018, 10:02 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X