న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కిచెన్‌లో 100.. సచిన్‌కు యువీ మరో ఛాలెంజ్‌!!

Time to break my record of 100 in the kitchen: Yuvraj Singh throws down new challenge for Sachin

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్‌ ఉండడంతో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ 'కీపిటప్'‌ ఛాలెంజ్‌ను తీసుకొచ్చాడు. ఈ ఛాలెంజ్‌ నిరంతరాయంగా కొనసాగింది. భారత ఆటగాళ్లు ఒక్కొక్కరూ మిగతావాళ్లకి నామినేట్‌ చేస్తుండడంతో ఆ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వంటింట్లో 100:

తాజాగా యువరాజ్‌ సింగ్‌ 'వంటింట్లో 100' పేరిట మరో కొత్త ఛాలెంజ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. దీనిలో భాగంగా వంటింట్లో ఛపాతీ కర్రతో బంతి కిందపడకుండా వందసార్లు కొట్టాలి. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన యూవీ.. సచిన్‌ టెండూల్కర్‌కు సవాల్‌ విసిరాడు. 'మాస్టర్‌ ఇప్పటివరకు మైదానంలో మీరు ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈ సారి కిచెన్‌లో సెంచరీ రికార్డును బ్రేక్‌ చేయండి. అంతేగానీ వంటింట్లోని మిగతా సామాగ్రిని బ్రేక్‌ చేయకండి. నేను పూర్తి చేసిన ఛాలెంజ్‌కు సంబంధించిన ఫుల్‌ వీడియోను పోస్ట్‌ చేయలేదు' అంటూ యువీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కాన్సర్‌ తర్వాత:

కాన్సర్‌ తర్వాత:

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెండు మెగా టోర్నీల్లోను 'టోర్నీ ఆఫ్‌ ది సిరీస్'‌గా నిలిచాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యూవీ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. 2011 ప్రపంచకప్‌ తర్వాత కాన్సర్‌ బారీన పడిన యూవీ.. లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స తీసుకొని టీమిండియా తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడినా మునుపటి ప్రదర్శనను చూపించలేకపోయాడు. అందులో 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది.

గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు:

గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు:

2019 జూన్‌లో యువరాజ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ భారత్‌ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా.. ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Sunday, May 31, 2020, 19:00 [IST]
Other articles published on May 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X