న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా అనుభవాలు పంచుకుంటు బోరున ఏడ్చేసిన కేకేఆర్ ప్లేయర్ (వీడియో)

Tim Seifert breaks down while narrating his Covid experience in India during IPL 2021

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు కరోనా వైరస్ బారిన న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్.. ఆ అనుభవాన్ని వివరిస్తూ బోరుమన్నాడు. కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే ఏం చేయాలో అర్థంకాలేదన్నాడు. మహమ్మారి కారణంగా భారత్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల నడుమ ప్రాణాలతో ఇంటికి చేరుతానా? లేదా? అనే సందేహం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆక్సిజన్ సహకారం తీసుకోవాలా? ఆస్పత్రిలో పడక దొరుకుతుందా? బయట అవుతున్నట్టే తనకూ జరుగుతుందా? అని కంగారు పడ్డానన్నాడు. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మేనేజ్‌మెంట్స్ సహకారంతో కుదుట పడ్డానని వివరించాడు.

అలీ ఖాన్ స్థానంలో..

ఐపీఎల్ 2021 సీజన్‌లో గాయపడ్డ అమెరికా ప్లేయర్ అలి ఖాన్ స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్.. స్వదేశానికి పయనమయ్యే ముందు కరోనా బారిన పడ్డాడు. కరోనాతో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో తన దేశస్థులతో కలిసి స్వదేశం వెళ్లేందుకు సిఫెర్ట్ సిద్ధమయ్యాడు. మరుసటి రోజు విమానం ఎక్కుతామనగా అతనికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో చెన్నైలో క్వారంటైన్‌ అయ్యాడు. కోలుకున్నాక న్యూజిలాండ్‌ వెళ్లాడు. తన అనుభవాన్ని వివరిస్తూ కన్నీరు కార్చాడు.

భయంతో వణికిపోయా..

భయంతో వణికిపోయా..

'కరోనా టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిందని చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజర్‌ చూపించాడు. దాంతో ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా భయమేసింది. భారత్‌లో బాధితుల గురించి మీరు వినే ఉంటారు. నాకూ అలాగే జరుగుతుందా? అని ఆందోళన చెందాను. ఆక్సీజన్‌ కొరత వార్తలే వినిపించేవి. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయో లేదో తెలియదు. అసలు కొవిడ్‌ గురించే ఇంకా పూర్తిగా తెలియదు' అని సీఫెర్ట్‌ అన్నాడు.

ఆ ఇద్దరు అండగా నిలిచారు..

ఆ ఇద్దరు అండగా నిలిచారు..

సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కేకేఆర్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తనకు కాస్త ఉపశమనం కలిగించారని టిమ్‌ తెలిపాడు. 'వారు నాకు భరోసా కల్పించారు. అన్నీ సవ్యంగా ఉండేట్టు చూసుకున్నారు. సీఎస్‌కే, కేకేఆర్‌ యాజమాన్యాలూ పరిస్థితిని పర్యవేక్షించాయి. ఇంటికి క్షేమంగా తిరిగివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా పాజిటివ్‌గా ఉండాలని అర్థమైంది. అనుకున్న సమయం కన్నా ముందుగానే రావడంతో నా కాబోయే భార్య సంతోషించింది' అని సీఫెర్ట్‌ చెప్పుకొచ్చాడు. టీమ్ సిఫెర్ట్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

యూఏఈలో సెకండాఫ్

యూఏఈలో సెకండాఫ్

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్​లు మిగిలి ఉన్నాయి.కాగా ఈ మిగిలిన మ్యాచ్​లను యూఏఈ వేదికగా సెప్టెంబర్​ - అక్టోబర్ మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఐపీఎల్ రెండో దశలో అన్ని దేశాల ప్లేయర్లు పాల్గొంటారా అన్నది సందేహంగా మారింది. ఆ సమయంలో వివిధ అంతర్జాతీయ సిరీస్​లు ఉండడంతో ఫారిన్ ప్లేయర్లు కొందరు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్ రెండో దశపై బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుంది. ఈ మీటింగ్‌లో లీగ్‌కు సంబంధించిన తుది నిర్ణయం వెలువడనుంది.

Story first published: Tuesday, May 25, 2021, 18:41 [IST]
Other articles published on May 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X