న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుడ్ న్యూస్‌.. ఐసీసీ టెస్టు జ‌ట్టులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు!

Three Indian players in the 2021 ICC Test squad

ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2021 సంవ‌త్స‌రానికి గాను తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే, టీ20 జ‌ట్టులో ఒక్క భార‌త ఆట‌గాడు కూడా లేడ‌ని బాధ ప‌డుతున్న అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. ప‌రిమిత ఓవ‌ర్ల జ‌ట్టులో చోటు లేక పోత‌నేం టెస్టు జ‌ట్టులో ముగ్గురు భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. ఒక బ్యాట‌ర్, వికెట్ కీప‌ర్, ఒక బౌల‌ర్ మ‌న వాళ్లే ఎంపిక‌య్యారు. అంతేకాకుండా ఈ జ‌ట్టులో భార‌త్ నుంచే ఎక్కువ మందికి చోటు ద‌క్క‌డం విశేషం.

ముగ్గురికి చోటు

ఐసీసీ టెస్టు జ‌ట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఓపెన‌ర్‌గా చోటు ద‌క్కించుకున్నాడు. 2021లో 47 స‌గ‌టుతో అత‌ను 906 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక వికెట్ కీప‌ర్‌గా రిష‌బ్ పంత్ ఎంపిక‌య్యాడు. 2021లో 12 మ్యాచ్‌లాడిన పంత్ 748 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీప‌ర్‌గా 39 మందిని ఔట్ చేసిన స‌త్తా చాటాడు. ఇక స్పిన్ బౌల‌ర్‌గా ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఎంపికయ్యాడు. గ‌తేడాది అశ్విన్ స‌త్తా చాటాడు. అంతేకాకుండా ఐసీసీ ప్ర‌క‌టించిన 2021 టెస్ట్ జ‌ట్టులో అత్యధికంగా భార‌త్ నుంచే ముగ్గురు ఆట‌గాళ్లు ఎంపిక‌య్యారు.

కెప్టెన్‌గా ఎవ‌రంటే..

కెప్టెన్‌గా ఎవ‌రంటే..

2021 టెస్టు జ‌ట్టుకు న్యూజిలాండ్ సార‌థి కేన్ విలియ‌మ్స‌న్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 2021లో బ్యాట్‌తో, కెప్టెన్‌గా విలియ‌మ్స‌న్ అద‌ర‌గొట్టాడు. న్యూజిలాండ్‌ను వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌గా నిల‌బెట్ట‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో విలియ‌మ్స‌న్ ఐసీసీ 2021 సంవ‌త్స‌రానికి గాను టెస్టు జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

ఇంకా ఎవ‌రెవ‌రంటే..

ఇంకా ఎవ‌రెవ‌రంటే..

ఈ టెస్టు ఎలెవన్‌లోని ఇతర ఆటగాళ్లలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్‌, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్, పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఫవాద్ ఆలం, బ్లాక్ క్యాప్స్ పేసర్ కైల్ జేమీసన్, పాకిస్థాన్ పేస్ ద్వయం హసన్ అలీ, షాహీన్ అఫ్రిదీ ఉన్నారు.

ఐసీసీ టెస్ట్ జ‌ట్టు:

ఐసీసీ టెస్ట్ జ‌ట్టు:

దిముత్ కరుణరత్నే, రోహిత్ శర్మ, మార్నస్ ల‌బుషేన్‌, జో రూట్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫవాద్ ఆలం, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), రవి చంద్ర‌న్‌ అశ్విన్, కైలీ జేమీసన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది.

భార‌త ఆట‌గాళ్ల‌కు ద‌క్క‌ని చోటు

భార‌త ఆట‌గాళ్ల‌కు ద‌క్క‌ని చోటు

కాగా ఐసీసీ వ‌న్డే, టీ20 జ‌ట్ల‌లో ఒక్క భార‌త ఆట‌గాడికి కూడా చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. వ‌న్డే, టీ20 జ‌ట్లు రెండింటికి పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామే నాయ‌కుడిగా ఎంపిక‌వ‌డం గ‌మ‌నార్హం.

వ‌న్డే జ‌ట్టు

వ‌న్డే జ‌ట్టు

పాల్ స్టిర్లింగ్, జన్నెమాన్ మలన్, బాబర్ అజామ్ (కెప్టెన్‌), ఫఖర్ జమాన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీప‌ర్), వనిందు హసరంగా, ముస్తాఫిజుర్ రెహమాన్, సిమి సింగ్, దుష్మంత చమీరా.

All About The New Rule In T20 Cricket | ICC | BCCI | Oneindia Telugu
టీ20 జ‌ట్టు

టీ20 జ‌ట్టు

బాబర్ అజామ్‌ (కెప్టెన్), జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, తబ్రైజ్ షమ్సీ, జోష్ హేజిల్‌వుడ్, వనిదు హసరంగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షాహీన్ అఫ్రిది.

Story first published: Thursday, January 20, 2022, 17:51 [IST]
Other articles published on Jan 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X