న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఫ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ సెట్‌ కాకపోతో.. ప్లాన్‌-బి కూడా ఉంది: మురళీధరన్‌

Thought I’d bowl leg spin, Muttiah Muralitharan’s stunning revelation

కొలొంబో: ప్రపంచ టెస్టు, వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిటే ఉంది. మురళీధరన్‌ రిటైర్మెంట్ ప్రకటించి తొమ్మిదేళ్లు అయినా కూడా అతని రికార్డులకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేదు. 495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు పడగొట్టి కెరీర్‌ను అద్భుతంగా ముగించాడు. ఆస్ట్రేలియా తరఫున షేన్ వార్న్ 1001 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్‌లో వికెట్లు తీయడంలో పోటీపడ్డారు. మురళీ 800 వికెట్లు పడగొట్టగా.. వార్న్ 708 వికెట్లు సాధించాడు.

ఆఫ్‌ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో మురళీధరన్‌లోని ప్రత్యేక శైలి. అయితే తన యాక్షన్‌పై అనేకసార్లు వార్తల్లో నిలిచిన మురళీ‌.. ఎప్పటికప్పుటూ ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ పొందుతూనే అరుదైన రికార్డును సాధించాడు. 1998-99 సీజన్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మురళీ‌ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్‌ రాస్‌ ఎమెర్సన్‌ వరుసగా నో బాల్స్‌ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయినప్పటికీ తన యాక్షన్‌లో ఎటువంటి లోపం లేదని నిరూపించుకున్న ఈ స్పిన్‌ మాంత్రికుడు టెస్టు ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేసాడు.

ఇంతటి గొప్ప బౌలర్ కెరీర్ తొలినాళ్లలో ప్లాన్‌-బితో క్రికెట్‌లోకి వచ్చా అని తాజాగా తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సమయంలో ఆఫ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ సెట్‌ కాకపోయి ఉంటే.. లెగ్‌ స్పిన్‌ బౌలర్‌గా మారేవాడిన్నాడు. తాజాగా ముత్తయ్య మురళీధరన్‌ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ... 'నేను యువకుడిగా ఉన్నప్పడు లెగ్‌ స్పిన్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాడిని. ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌గా టెస్టుల్లో సెట్‌ కాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని కోసం లెగ్‌ స్పిన్‌ను ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ టెస్టుల్లో ఆఫ్‌ స్పిన్నర్‌గా కొనసాగిన నేను అది వర్క్‌ కాకపోయి ఉంటే కచ్చితంగా లెగ్‌ స్పిన్నర్‌ను అయ్యేవాడిని' అని తెలిపాడు.

ఎవరైనా క్రికెట్‌లోకి రావాలనుకుంటారో ప్లాన్‌-ఏ, ప్లాన్‌-బీలు సిద్ధంగా ఉంచుకోవాలని స్పిన్‌ మాంత్రికుడు మురళీ సలహా ఇచ్చాడు. ఏదొక దానికే మాత్రమే కట్టుబడి ఉంటే అది వర్కౌట్‌ కాకపోతే సమస్యలు వస్తాయన్నాడు. ప్రొఫెషనల్‌ స్థాయిలో ఒక గేమ్‌ను ఆడాలంటే మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. ఇది కేవలం క్రికెట్‌ మాత్రమే పరిమితం కాదని, అన్ని క్రీడలకు వర్తిస్తుందన్నాడు. మానసిక బలమే ఆటలో కీలక పాత్ర పోషిస్తుందని మురళీ చెప్పుకొచ్చాడు.

స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్‌లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో ఆడనన్న ఆండ్రూ సైమండ్స్.. బుజ్జగించిన మాక్స్‌వెల్!!ఐపీఎల్‌లో ఆడనన్న ఆండ్రూ సైమండ్స్.. బుజ్జగించిన మాక్స్‌వెల్!!

Story first published: Friday, June 12, 2020, 15:25 [IST]
Other articles published on Jun 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X