న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

74 బంతుల్లో 140 పరుగుల బాదిన బౌలర్

Thisara’s 140 in vain as New Zealand snatch ODI series

హైదరాబాద్: మ్యాచ్‌లలో ప్రతీకారం తీర్చుకోవడం మామూలే. అయితే బ్యాట్స్‌మెన్ పరుగులు తీసి చూపిస్తారు. బౌలర్లు వికెట్లు తీసి ప్రదర్శిస్తారు. కానీ, ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలర్ తన వైఫల్యాన్ని ప్రత్యర్థి జట్టు చక్కగా వినియోగించుకుంటే దానికి ప్రతి దాడి దిగిన బౌలర్ బ్యాట్ చేపట్టి పరుగుల వర్షం కురిపించాడు. బౌండరీలను శాసించాడు. తిసారా పెరీరా తొలి వన్డేలో ఐదు... రెండో వన్డేలో మరో ఐదు... సిక్సర్లు బాది సత్తా చాటాడు. ఇలా తన కసినంతా రెండో వన్డేలో తన బ్యాటింగ్‌లో చూపించాడు. పదికి తోడు అదనంగా మరో మూడు సిక్సర్లు బాది వీర బాదుడు బాదాడు.

21 పరుగుల తేడాతో లంకను ఓడించి

21 పరుగుల తేడాతో లంకను ఓడించి

ఇంతటి విధ్వంసం సృష్టించినా జట్టుకు ఏ మాత్రం లాభం లేకుండాపోయింది. 74 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. శనివారం బే ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. అంతకంటేముందు కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (105 బంతుల్లో 90; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మున్రో (77 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషామ్‌ (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.

 46.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌట్

46.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌట్

చేధనకు దిగిన లంక 46.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. తిసారా జోరుకు తోడు గుణతిలక (71; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకానొక దశలో 16 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 128/7గా నిలిచింది. ఆ తర్వాత 19.2 ఓవర్ల పాటు ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడుతూ పెరీరా జోరు కొనసాగింది. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ, 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తిసారా లాంగాన్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌

తిసారా లాంగాన్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌

సౌతీ ఓవర్లో అతను 4 భారీ సిక్సర్లతో చెలరేగడం ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. చివరి మూడు వికెట్లకు 75, 51, 44 పరుగులు భాగస్వామ్యాలు నెలకొల్పిన తిసారా జట్టును గెలిపించలేకపోయాడు. 23 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి తిసారా లాంగాన్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో లంక ఓటమి ఖాయమైంది.

Story first published: Sunday, January 6, 2019, 16:51 [IST]
Other articles published on Jan 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X