న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొలార్డ్, మలింగ మాయ.. ముంబై ఇండియన్స్ నాలుగో టైటిల్​కు ఏడాది!!

This day, last year: IPL triumph for Mumbai Indians, heartbreak for Chennai Super Kings

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ నాలుగో టైటిల్ గెలిచి సరిగ్గా ఈ రోజు (2019 మే 12)కి ఏడాది. ఇదే రోజు ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ అవతరించాడు. కెప్టెన్‌గా ఐపీఎల్​లో తన జట్టు ముంబై ఇండియన్స్​కు నాలుగో టైటిల్​ను హిట్‌మ్యాన్ అందించాడు. 2019 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్​ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించి ఐపీఎల్​లో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్​ నిలిచింది.

ఐపీఎల్ 2020 రద్దయితే బీసీసీఐకి రూ.4వేల కోట్ల నష్టం!!ఐపీఎల్ 2020 రద్దయితే బీసీసీఐకి రూ.4వేల కోట్ల నష్టం!!

హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ముంబైకి భారీ షాక్ తగిలింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఓపెనర్ క్వింటన్ డికాక్ (29) పెవిలియన్‌కు చేరగా.. ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (15), కృనాల్ పాండ్యా (7) నిరాశపరిచారు. ముంబై ఓ దశలో 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ (41నాటౌట్​) మాయ చేసాడు. ముంబై 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్ దీపక్ చాహర్ మూడు వికెట్లు తీశాడు.

150 పరుగుల లక్ష్యఛేదనలో డుప్లెసిస్ ​(26), సురేశ్ రైనా (8), ఎంఎస్ ధోనీ (2), అంబటి రాయుడు (1) విఫలమవడంతో చెన్నై 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ షేన్ వాట్సన్ (80) చివరి వరకు పోరాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్‌ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసిన మలింగ మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పాడు. దీంతో ముంబై ఇండియన్స్ నాలుగో ఐపీఎల్‌ టైటిల్ గెలిచింది. లీగ్‌లో మరే జట్టూ ఇన్నిసార్లు విజేతగా నిలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.

మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ సహా అన్ని క్రీడలు వాయిదా లేదా రద్దు చేయబడ్డాయి. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభంకావాల్సి ఐపీఎల్.. కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి వాయిదా పడింది. ఆ తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ని మరోసారి కొనసాగించడంతో ఐపీఎల్‌ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది.

ప్రమాదకర వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇపుడుడప్పుడే ఐపీఎల్ జరిగే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ షెడ్యూల్ మార్డుద్దామంటే.. ఈ ఏడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, ఆసీస్ పర్యటనలు ఉన్నాయి. ఇప్పటికే పీసీబీ ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ జరగడం అనుమానమేనని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకి దాదాపు రూ. 4వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు.

Story first published: Tuesday, May 12, 2020, 15:17 [IST]
Other articles published on May 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X