న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని వెల్లువెలా డిమాండ్లు.. ఈ ముగ్గుర్లో ఒకరికి ఛాన్స్?

These three players can replace babar azam as pakistan team captain

ఈసారి టీ20 ప్రపంచకప్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన జట్లలో పాకిస్తాన్ ఒకటి. భారత్‌ చేతిలో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ జట్టు.. మరుసటి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో కూడా ఒత్తిడికి తలొగ్గింది. జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలవడంతో ఆ జట్టుపై విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులే కాదు, పాక్ మాజీ క్రికెటర్లు కూడా జట్టును తప్పుబట్టారు. షోయబ్ అక్తర్ వంటి వాళ్లయితే అసలు జట్టు సెలెక్షనే బాగలేదని తీవ్రంగా విమర్శించారు.

బాబర్‌పై ఫోకస్..

బాబర్‌పై ఫోకస్..

ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు, నాయకత్వంపై కూడా పలువురు మాజీలు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అతను ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడని వసీం అక్రమ్ వంటి వారు కూడా కామెంట్ చేశారు. ఈ టోర్నీలో బాబర్ బ్యాటుతో కూడా రాణించలేదు. ఈ టోర్నీలో కనీసం రెండంకెల స్కోరు చేరుకోవడం కూడా బాబర్ వల్ల కాలేదు. ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని, అప్పుడే బాబర్ పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెడతాడని అంటున్నారు. మరి అతని స్థానంలో జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూస్తే..

మహమ్మద్ రిజ్వాన్

మహమ్మద్ రిజ్వాన్

టీ20ల్లో రెండ్రోజుల క్రితం వరకు టాప్ బ్యాటర్‌గా ఉన్న మహమ్మద్ రిజ్వాన్.. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లలో ఒకడు. అంతేకాక వికెట్ కీపర్ కావడం కూడా రిజ్వాన్‌కు కలిసొస్తుంది. రిజ్వాన్‌ ఇంతకుముందు రెండు టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహించాడు. అందుకే బాబర్‌కు పర్‌ఫెక్ట్ రిప్లేస్‌మెంట్ రిజ్వాన్ అని కొందరు అంటున్నారు. అంతేకాదు, గతేడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తను సారధ్యం వహించిన ముల్తాన్ సుల్తాన్ జట్టుకు కప్పు అందించిన అనుభవం కూడా రిజ్వాన్ సొంతం.

 షాదాబ్ ఖాన్

షాదాబ్ ఖాన్

బాబర్‌ను రిప్లేస్ చేయడానికి ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా మరో చాయిస్. మైదానంలో నూరుశాతం కష్టపడే షాదాబ్‌ ప్రస్తుతం పాక్ జట్టు వైస్ కెప్టెన్. గతంలో మూడు టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు కూడా. జట్టును ముందుండి నడిపిస్తూ.. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే సత్తా షాదాబ్‌కు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో పాకిస్తాన్ తరఫున నిలకడగా రాణించే ఆటగాళ్లలో షాదాబ్ కూడా ఒకడు కావడం గమనార్హం.

షహీన్ అఫ్రిదీ

షహీన్ అఫ్రిదీ

పాక్ బౌలర్లలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆటగాడు షహీన్ షా అఫ్రిదీ. గతేడాది టీ20 ప్రపంచకప్ తొలి గేమ్‌లో భారత టాపార్డర్‌ను కూల్చడం ద్వారా పాక్‌లో కూడా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అంతేకాదు, ఈ ఏడాది పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు సారధ్యం వహించి, ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడీ స్టార్ పేసర్. అయితే ఇంతకాలం ఏ జట్టు కూడా కెప్టెన్‌గా బౌలర్లను ఎంపిక చేసే సాహసం చెయ్యలేదు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్యాట్ కమిన్స్‌కు ఆ జట్టు టెస్టు సారధ్య బాధ్యతలు అప్పగించింది. భారత్ కూడా బుమ్రాను టెస్టు కెప్టెన్‌గా ఆడించింది. మరి పాక్ క్రికెట్ బోర్డు కూడా ఇదే బాటలో నడిచి.. బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే షహీన్‌కు జట్టు పగ్గాలు అందిస్తుందేమో చూడాలి.

Story first published: Friday, November 4, 2022, 14:53 [IST]
Other articles published on Nov 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X