న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'1200 బంతులు ఎదుర్కొన్నాడు, యువతరానికి పుజారా ఆదర్శం'

India vs Australia : Pujara Has Set The Benchmark For Youngsters Says Shubman Gill | Oneindia Telugu
There is a lot to learn seeing the way Cheteshwar Pujara bats: Shubman Gill

హైదరాబాద్: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా బ్యాటింగ్ చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శుభమాన్ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.

ఆరేళ్లలో ఆరుగురు: హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్రసింగ్‌పై వేటుఆరేళ్లలో ఆరుగురు: హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్రసింగ్‌పై వేటు

"బంతిని చూసి రోజంతా ఆడగలిగే బ్యాట్స్‌మెన్‌ కొందరే ఉంటారు. ఆసీస్ పర్యటనలో పుజారా 1200 బంతులకు పైగా ఎదుర్కొన్నాడు. ఇదో అద్భుతం. ఒక సిరీస్‌లో 500 పరుగులు చేయడం సులభమే. చాలా ఎక్కువ బంతులు ఆడి ఆయన యువతరానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. పుజారా ఓపిక, బ్యాటింగ్‌ చూసి ఎంతో నేర్చుకోవచ్చు" అని శుభమాన్ అన్నాడు.

కఠినమైన ఆసీస్ పిచ్‌లపై

కఠినమైన ఆసీస్ పిచ్‌లపై

"ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ క్లాస్ పేస్ ఎటాక్ ఉంది. అక్కడి కఠిన పిచ్‌లపై వారిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం చాలా కష్టం. ఈ రోజులు ఆటగాళ్లంతా త్వరగా పరుగులు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు" అని శుభమాన్ గిల్ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లాడిన పుజారా 1,238 బంతులు ఎదుర్కొని 521 పరుగులు సాధించాడు.

మూడు సెంచరీలు చేసిన పుజారా

మూడు సెంచరీలు చేసిన పుజారా

ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసిన త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో పుజారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సిరిస్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డుని పుజారా అధిగమించాడు.

ద్రవిడ్ రికార్డు బద్దలు

ద్రవిడ్ రికార్డు బద్దలు

2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్‌ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దానిని బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు.

ఐదు మ్యాచుల్లో 720 పరుగులు

ఐదు మ్యాచుల్లో 720 పరుగులు

ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్‌ను నెగ్గడంలో పుజారాదే కీలకపాత్ర. పుజారాతో పాటు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. శుభమాన్ గిల్ రంజీల్లో ఐదు మ్యాచుల్లోనే దాదాపు 80 యావరేజితో 720 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Thursday, January 10, 2019, 11:55 [IST]
Other articles published on Jan 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X