న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ బ్యాట్ పట్టిన అజహరుద్దీన్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ (వీడియో)!!

 Them wristy flicks: Mohammad Azharuddin shares batting video on Twitter
Mohammad Azharuddin Shares A Video Of Him Playing Different Shots

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ను మళ్లీ బ్యాటు పట్టాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడాడు. కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 37 సెకన్ల వీడియోలో త్రో చేస్తున్న బంతుల్ని అజ్జూ నాకింగ్‌ చేశాడు.

ఆసియా కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం!!ఆసియా కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం!!

మళ్లీ బ్యాట్ పట్టిన అజహరుద్దీన్:

'నాక్‌ నాక్‌.. మునుపటిలా టైమింగ్‌ చేస్తున్నా. అజహర్‌ ఫ్లిక్స్‌' అంటూ వీడియోకు అజహరుద్దీన్‌ వ్యాఖ్య జోడించాడు. మైదానంలో అతను ఆడిన ప్లిక్‌షాట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భారత జట్టుకు అజహరుద్దీన్‌ చేసిన సేవలకు గుర్తింపుగా హెచ్‌సీఏ గత డిసెంబర్ నెలలో అతడిని గౌరవించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్‌ పెవిలియన్‌ స్టాండుకు అజహరుద్దీన్ పేరు పెట్టింది. ఈ స్టాండ్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రారంభించాడు.

 21 ఏళ్ల వయసులో అరంగేట్రం:

21 ఏళ్ల వయసులో అరంగేట్రం:

మహ్మద్ అజహరుద్దీన్ భారత టెస్టు జట్టులోకి 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేచేసాడు. ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉంది. అజహర్‌ భారత్‌ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.టెస్టుల్లో 6,215 పరుగులు.. వన్డేల్లో 9,378 పరుగులు చేసాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 29 సెంచరీలు బాదాడు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 2000లో ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.

జీవితకాలం నిషేధం:

జీవితకాలం నిషేధం:

2000లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కి గురవగా.. అందులో అజహరుద్దీన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోన్జ్‌తో కలిసి బుకీలతో అజహరుద్దీన్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అజహరుద్దీన్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. నిషేధంపై ఎన్నొ ఏళ్లు పోరాడాడు. చివరకు 2012లో ఆ నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎత్తివేసింది. సచిన్‌ (463), ధోనీ (350), ద్రవిడ్‌ (344) తర్వాత అజహరుద్దీనే (334) అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. అలాగే భారత సారథిగా 174 వన్డేల్లో, 47 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు.

 ఏడాది ఎన్నికల్లో విజయం:

ఏడాది ఎన్నికల్లో విజయం:

నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎత్తివేసినప్పటికీ హెచ్‌సీఏ ఎన్నికల్లో అతడ్ని కొందరు పోటీపడనివ్వలేదు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్‌ నామినేషన్‌ వేయగా.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోవడంతో నామినేషన్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ ఆమోదించలేదు. పోరాడిన అజహరుద్దీన్ ఎట్టకేలకి గత ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.

Story first published: Saturday, June 6, 2020, 11:30 [IST]
Other articles published on Jun 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X