న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌పై జాలి చూపిస్తున్న డివిలియర్స్

The way Steve Smith was punished was harsh, says AB de Villiers

హైదరాబాద్: ఐపీఎల్ కు ముందు క్రికెట్ ప్రపంచంలో నలిగిన ఒకటే టాపిక్ బాల్ టాంపరింగ్. ఐపీఎల్ రాగానే దాదాపు చాలామంది వరకు దాని గురించి ప్రస్తావించడమే మానేశారు. అయితే ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతోన్న డివిలియర్స్ ఈ విషయంపై స్పందించాడు. స్మిత్ విషయంలో చాలా ఘోరం జరిగిందని చెప్పుకొచ్చాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై జాలి చూపించాడు సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్.

వేసిన శిక్ష చాలా కఠినమైనది

వేసిన శిక్ష చాలా కఠినమైనది

ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. డివిలియర్స్‌కు వేసిన శిక్ష చాలా కఠినమైనది. ఇది చాలా సీరియస్ విషయం. అయితే దీనిని మరీ వాళ్లను వ్యక్తిగతంగా బాధించే స్థాయికి తీసుకెళ్లారు. వాళ్లను చూస్తే బాధేసింది. ముఖ్యంగా స్మిత్‌ని చూస్తే.. అతను తన ప్లేయర్స్‌కు అండగా నిలిచాడు. అతనికి విధించిన శిక్ష చాలా కఠినమైంది అని ఏబీ చెప్పాడు.

తప్పు తప్పే.

తప్పు తప్పే.

తప్పు తప్పే. బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి వాళ్లు ప్రయత్నించారు. కానీ అది చట్టాలకు లోబడే చేయాలి. సాండ్‌పేపర్‌తో చేయడం నమ్మలేకపోతున్నా. అది నా బ్యాగులో కూడా ఉంటుంది. కానీ దానిని నా బ్యాట్‌ను శుభ్రం చేయడానికి వాడుతా అని అతను అన్నాడు.

బాగా ఎంజాయ్ చేశా

బాగా ఎంజాయ్ చేశా

అయితే స్లెడ్జింగ్, టాంపరింగ్, క్రమశిక్షణ విచారణలు, నిషేధాలు వంటి ఎన్నో వివాదాలు ఉన్నా.. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను తాను బాగా ఎంజాయ్ చేశానని ఏబీ చెప్పాడు. కేవలం ఆట పరంగా చూస్తే మాత్రం తాను ఆడిన అత్యుత్తమ సిరీస్‌లో ఇదీ ఒకటి అని అన్నాడు.

 గెలుపోటములు అనేవి ఆటలో సహజం

గెలుపోటములు అనేవి ఆటలో సహజం

గెలుపోటములు అనేవి ఆటలో సహజం. ఒకవేళ ఓడిపోయే పరిస్థితులేర్పడినా దాదాపు ఇలాంటివి చేయకపోవడమే మంచిది. కానీ, వాళ్లు చేసింది తప్పే కావచ్చు. కానీ, దానికి మరీ ఇంత కఠినమైన శిక్ష తగదని చెప్పుకొచ్చాడు. ఆ శిక్ష వ్యక్తిగతంగా కూడా బాధపడేలా ఉంది. అని వివరించాడు.

Story first published: Friday, April 27, 2018, 15:39 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X