న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్ట్‌లో అందరి దృష్టి సంధ్య వెలుగుపైనే: ఆ రెండు గంటలే ముఖ్యమంటున్న క్రికెట్ విశ్లేషకులు!

The Twilight Saga: What is worrying Virat Kohli & Co. before day-night Test

హైదరాబాద్: సంధ్య వెలుగు - ప్రకృతి తన రక్షణను మార్చుకునే సందర్భంలో విరామం ఇచ్చే సమయం. తెలుగులో అర్ధమయ్యేలా చెప్పాలంటే సూర్యుడు అస్తమించే సమయంలో ప్రసరించే వెలుగు. ఈ సమయంలో ఉండే కొద్దిపాటి వెలుగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ప్లడ్ లైట్ల వెలుగులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను వాడ‌నున్నారు. దీంతో పింక్ బాల్ ఏ సమయంలో ఎలా స్పందిస్తుందో.. దానిపై ఎలా నియంత్రణ సాధించాలనే ఆందోళన ఇరు జట్ల ఆటగాళ్లు ఉన్నారు.

అయితే, ఈ పింక్ బాల్‌తో ఆడిన, చూసిన వాళ్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అవగాహన ఉన్నవాళ్లు ఒకే ఒక మాట చెబుతున్నారు. అదేంటంటే ప్రతి రోజూ ఆటలో సూర్యుడి అస్తమించే సమయంలో రెండు గంటల సమయం అత్యంత కీలకమవుతుందని అంటున్నారు.

మధ్యాహ్నం 1 గంటకి

మధ్యాహ్నం 1 గంటకి

మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది.

ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పింక్ బాల్ అత్యంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ సమయంలో పేస్ బౌలర్లు చెలరేగే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాచ్‌ ఆరంభంలో కొత్త బంతి ఇబ్బంది పెట్టినప్పటికీ క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు రాబట్టొచ్చు.

సూర్యాస్త సమయంలో బంతిని గుర్తించడం

సూర్యాస్త సమయంలో బంతిని గుర్తించడం

అయితే, వెలుతురు తగ్గిపోయే కొద్దీ అంటే సూర్యాస్త సమయంలో బంతిని గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు ఓ సవాల్ అని చెబుతున్నారు. ఆ సమయంలో రెండో సెషన్‌ నడుస్తుంటుంది కాబట్టి అప్పటికీ బంతి మరీ పాతబడదు. మిగతా సమయాలతో పోలిస్తే ఎక్కువ స్వింగ్‌, వేగంతో పింక్ బాల్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే పింక్ బాల్ టెస్టులో రెండో సెషన్ ఎంతో కీలకమని అంటున్నారు. ఇక, ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.

సాహాకు పింక్ బాల్‌తో ఆడిన అనుభవం

సాహాకు పింక్ బాల్‌తో ఆడిన అనుభవం

ఇదిలా ఉంటే, పింక్ బంతితో ఆడిన అనుభవం ఉన్న కొద్దిమందిలో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఒకడు. అయితే, సాహాకు కూకబుర్రా బంతితో ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సాహా మాట్లాడుతూ "మేము మూడేళ్ల క్రితం ఆడినప్పుడు అది కూకబుర్రా బంతి. కానీ ఇప్పుడు ఎస్జీ బంతి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంచెం స్వింగ్ ఉండొచ్చు. కానీ, సవాల్ ఎదుర్కొనేది మాత్రం సంధ్య వెలుగులోనే" అని అన్నాడు.

పేసర్లకు ప్రయోజనకరమే

పేసర్లకు ప్రయోజనకరమే

"ఇది పేసర్లకు ప్రయోజనకరమే. బ్యాట్స్‌మెన్‌కు కష్టం. ఇక తెలుపు బంతి క్రికెట్లో సైట్‌ స్క్రీన్‌ నలుపు రంగులో ఉంటుంది. బంతి పాతబడ్డా ఇబ్బంది ఉండుదు. పింక్ టెస్టులో అలా కాదు. బ్యాక్‌డ్రాప్‌ స్పష్టంగా ఉండదు. ఇది వికెట్‌ కీపర్‌కూ సవాల్‌గానే ఉంటుంది. నేను స్లిప్‌ ఫీల్డర్ల సమీపంలో నిల్చుంటాను. మా పేసర్లు కొన్నిసార్లు బాగా స్వింగ్‌ చేస్తారు. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి" అని అన్నాడు.

షమీ బౌలింగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్

షమీ బౌలింగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్

పింక్ బాల్ టెస్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమింిడయా వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగా పింక్ బాల్ టెస్టుకు ముందు 48 గంటలు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంధ్యా సమయంలో సెట్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో ప్రాక్సీట్ చేశాడు. అదే సమయంలో ప్లడ్ లైట్లు వెలిగి ఉండటం విశేషం. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రహానే కాపేపు ప్రాక్టీస్ చేశాడు.

స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ పట్టిన రహానే

స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ పట్టిన రహానే

అనంతరం రవిశాస్త్రి పర్యవేక్షణలో అశ్విన్, జడేజా బౌలింగ్‌లో రహానే స్లిప్‌లో క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. కాగా, టీమిండియా పేసర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన సమయంలో పిచ్ ఆకుపచ్చ రంగుని కలిగి ఉంది. మొత్తంగా పింక్ బాల్ టెస్టులో భారత పేసర్లు సత్తా చాటే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్లు 14 వికెట్లు తీయగా అందులో షమి 7 వికెట్లతో చెలరేగాడు. ఇక, కోల్‌కతా షమీ సొంత మైదానం కావడంతో అతడిపై జట్టు మేనేజ్‌మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Story first published: Thursday, November 21, 2019, 13:51 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X