భుజం కీలు పక్కకు జరిగింది: ఐపీఎల్‌కు టై దూరం

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌‌లో నాకౌట్‌కు ముందు గుజరాత్‌ లయన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భుజం నొప్పి కారణంగా గుజరాత్‌ లయన్స్‌ పేసర్‌ ఆండ్రూ టై మిగిలిన ఐపీఎల్‌కు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ సందర్భంగా బౌండరీ లైన్‌ దగ్గర బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్‌ కొట్టడంతో టై ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

డైవ్‌ చేసే ప్రయత్నంలో టై ఎడమ భుజం కీలు పక్కకు జరిగింది. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆండ్రూ టై మిగతా లీగ్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌ పదో సీజన్‌లో అరంగేట్రం చేసిన ఆండ్రూ టై ఆరు మ్యాచ్‌ల్లో ఆండ్రూ టై హ్యాట్రిక్‌ సహా 12 వికెట్లు తీసుకున్నాడు.

The Stands : Dislocated shoulder rules Andrew Tye out of IPL

ఐపీఎల్ బౌలర్ల జాబితాలో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టులో కీలక బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భాగంగా హ్యాట్రిక్‌ వికెట్లతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఐదు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

'భుజానికి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. గాయం తీవ్రత గురించి ఇప్పటికి తెలియలేదు. రెండు, మూడు రోజుల్లో మా ఇంటికి వెళ్తాను. నా గాయం మానడానికి చాలా సమయం పడుతుందని అనుకోవడం లేదు. త్వరగా కోలుకుంటాను' అని టై గాయంపై స్పందించాడు.

The Stands : Dislocated shoulder rules Andrew Tye out of IPL

ఐపీఎల్ లో గడిపిన క్షణాలు మధురమైనవి, గుజరాత్ అభిమానులు చూపించిన అభిమానం మర్చిపోలేనిదని, ఈ అవకాశం ఇచ్చిన ప్రాంచైజీకి, అభిమానులకు ధన్యవాదాలు అని వచ్చే ఎడాది జరిగే ఐపీఎల్ సీజన్ లో పాల్గొంటానని టై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక టై నిష్క్రమణ మాకు తీరని లోటు, టై త్వరగా కోలుకోవాలని గుజారాత్ జట్టు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Story first published: Monday, May 1, 2017, 11:47 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి