న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఎలా తయారుచేస్తారో తెలుసా? (వీడియో)

By Nageshwara Rao
The making of the ICC Cricket World Cup Trophy

హైదరాబాద్: క్రికెట్ అభిమానులంతా 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్ ప్రారంభించింది. తాజగా 2019 వన్డే వరల్డ్‌కప్ ఎలా తయారుచేశారో తెలుపుతూ ఓ మేకింగ్ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న వరల్డ్‌కప్ ప్రమోషన్స్ (వీడియో)క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న వరల్డ్‌కప్ ప్రమోషన్స్ (వీడియో)

వరల్డ్‌కప్ మేకింగ్‌తో పాటు, దాని కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులను కూడా ఈ వీడియోలో పరిచయం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 2019లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పోటీకి దిగే 10 జట్లు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.

పది జట్లలో ఒక్కో జట్టు గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లు ఆడాలి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్-4లో నిలిచిన జట్ల మధ్య సెమీ ఫైనల్స్‌లో తలపడతాయి. సెమీస్‌లో విజయం సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ వన్డే వరల్డ్‌కప్‌కు 10 నగరాలు ఆతిథ్యమిస్తోన్నాయి. మొత్తం 11 వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి.

మరోవైపు వరల్డ్‌కప్ టోర్నీ షెడ్యూల్‌‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. టైటిల్ నెగ్గాలంటే గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంపై క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఈ వరల్డ్‌కప్ మే 30న లండన్ ఓవల్ స్టేడియంలో ప్రారంభమై జులై 14న లార్డ్స్‌ స్టేడియంలో ముగియనుంది.

Story first published: Friday, August 24, 2018, 18:01 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X