న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంతో గర్విస్తున్నాం: వార్నర్‌పై అతడి భార్య ఎమోషనల్ మేసేజ్

IPL 2019 : David Warner Wife Emotional Message After Sunrisers Hyderabad Match Win ! || Oneindia
 The girls and I are proud of you: Wife Candices emotional message for David Warner

హైదరాబాద్: డేవిడ్ వార్నర్... ఐపీఎల్ 2019 సీజన్‌లో ఏడాది నిషేధం అనంతరం బరిలోకి దిగాడు. ఒకవైపు గాయాలు, మరొకవైపు నిషేధం ఇలాంటి నేపథ్యంలో వార్నర్ ఎలా ఆడతాడో అనే అనుమానం ప్రతిఒక్క సన్‌రైజర్స్ అభిమానిని ఆందోళనకు గురి చేసింది. అయితే, అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీజన్‌లో వార్నర్ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో అనేక మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో భాగంగా సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ తన ఆఖరి మ్యాచ్‌‌ని సోమవారం ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 81 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలిపించి ఈ సీజన్‌కు ముగింపు పలికాడు.

వార్నర్ అద్భుత ఇన్నింగ్స్‌పై అతడి భార్య

వార్నర్ అద్భుత ఇన్నింగ్స్‌పై అతడి భార్య కాన్‌డైస్ సైతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించింది. "మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను, మన పిల్లలు మిమ్మల్ని చూసి ఎంతో గర్విస్తున్నాం. ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు మంచి ముగింపు పలికారు. మీ వ్యక్తిత్వం, మీ కఠోరశ్రమ ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. వీ లవ్‌ యూ" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో

సోమవారం ఉప్పల్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 56 బంతుల్లో 81 (7 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత ప్రదర్శన చేసిన వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆవార్డు లభించింది. అనంతరం వార్నర్ మాట్లాడుతూ "గత కొన్ని నెలల నుంచి నేను ఎంతో శ్రమించాను. నిషేధ కాలంలో నేను బ్యాట్‌ పక్కన పెట్టినా.. ఉత్తమ భర్తగా.. ఉత్తమ తండ్రిగా ఉండగలిగాను. అదే నా విజయ రహస్యం. జట్టులో ఎప్పుడూ సరదాగా ఉండాలనుకుంటా" అని తెలిపాడు.

12 మ్యాచులాడి 692 పరుగులు చేసిన వార్నర్

ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ మొత్తం 12 మ్యాచులాడి 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా డేవిడ్ వార్నర్ సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఈ సీజన్‌లోనూ వార్నర్ 692 పరుగులు సాధించడంతో ఆడిన మూడు సీజన్లలోనూ వరుసగా 600పైగా పరుగులు చేసి ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే!

అంతేకాదు సన్‌రైజర్స్‌తో ఉన్న నాలుగు సీజన్లలో ప్రతిసారి 500కుపైగా పరుగులు సాధించాడు. 2016లో ఏకంగా 848 పరుగులు చేశాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టో జట్టుకు దూరం కాగా, ఇప్పుడు వార్నర్ కూడా దూరమయ్యాడు. ఇక, సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఆడాల్సిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి.

Story first published: Tuesday, April 30, 2019, 14:35 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X