ఐపీఎల్ 2018: ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్ల ఫోటో షూట్

Posted By:
The eight captains pose with the silverware as the VIVO IPL trophy

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 11వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు నిర్వాహకులు బిజీ అయ్యారు. మరోవైపు ఆటగాళ్లు సైతం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటూ చెమటోడ్చుతున్నారు.

టోర్నీలో భాగంగా ఐపీఎల్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, సమయాభావం వల్ల ఈ ఏడాది జరిగే ఐపీఎల్ ఆరంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరుకాని సంగతి తెలిసిందే.

కొన్ని కారణాల వల్ల ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్లు తప్ప... మిగతా జట్లకు చెందిన కెప్టెన్లు ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా
ఐపీఎల్‌ ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్లతో ఫొటో షూట్‌ నిర్వహించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌ పేజీలో అభిమానులతో పంచుకున్నారు. ఐపీఎల్ ట్రోఫీతో ఎనిమిది జట్లకు చెందిన కెప్లెన్లను ఒకేసారి చూడటంతో అభిమానులు సంతోషానికి గురయ్యారు. ఈ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 18:06 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి