న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాండ్ పేపర్ కన్నా బ్యాటే గొప్పది: స్మిత్‌ను గేలి చేసిన ఆ ఫ్యాన్సే చప్పట్లతో అభినందన

‘The bat is mightier than sandpaper’: Steve Smith walks back to standing ovation from England crowd, watch video

హైదరాబాద్: గతేడాది సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తనపై విధించిన నిషేధం ముగిసిన తర్వాత స్టీవ్ స్మిత్ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌తో టెస్టు క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఎడ్జిబాస్ట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఇంగ్లాండ్ అభిమానుల నుంచి అతడికి చేదు అనుభవం ఎదురైంది. బాల్ టాంపరింగ్ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీటిలో స్మిత్ ఏడ్చిన ముఖాన్ని మాస్క్‌లుగా ధరించి అతడిని ఎగతాళి చేశారు.

తక్కువ సమయంలోనే నిరూపించుకోండి.. యువ ఆటగాళ్లకు కోహ్లీ సూచన!!తక్కువ సమయంలోనే నిరూపించుకోండి.. యువ ఆటగాళ్లకు కోహ్లీ సూచన!!

అంతేకాదు ఛీటర్.. ఛీటర్ అంటూ నినాదాలు చేశారు. అయితే, స్మిత్ మాత్రం వాటిని ఏమీ పట్టించుకోకుండా నిలకడగా ఆడుతూ తొలి టెస్టులోనే రెండు సెంచరీలు బాదాడు. ఆ తర్వాత ఈ సిరిస్‌లో చెలరేగి ఆడాడు. లార్డ్స్ టెస్టులో గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన స్మిత్.. నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు.

నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీ

నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీతో మెరవడంతో ఆస్ట్రేలియా తిరిగి యాషెస్‌ను కూడా నిలుపుకుంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం అతడిని కొనియాడకపోగా... స్మిత్ ఎన్ని సెంచరీలు బాదినా... అతడిని మోసగాడిగానే పరిగణిస్తారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఒకరు అన్నారు.

ఏడు ఇన్నింగ్స్‌ల్లో 110.57 యావరేజితో 774 పరుగులు

అయితే, ఈ యాషెస్ సిరిస్‌లో స్మిత్ మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో 110.57 యావరేజితో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫలితంగా టెస్టుల్లో తిరిగి నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. యాషెస్‌లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ 23 పరుగులకే ఔటయ్యాడు.

చప్పట్లతో అభినందన

చప్పట్లతో అభినందన

అయితే, ఈ యాషెస్ సిరిస్ మొత్తం అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్... ఆఖరి టెస్టులో మాత్రం అతడు మైదానాన్ని వీడుతున్నప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో అభినందించారు. నిషేధం తర్వాత తన రీఎంట్రీలో అద్భుత ప్రదర్శనకు గాను అభిమానుల సైతం మెచ్చుకున్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సిరీస్ ఆద్యంతం వెనుకంజలోనే నిలిచిన ఇంగ్లండ్ ఎట్టకేలకు చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. స్టువర్ట్ బ్రాడ్ (4/62) జాక్ లీచ్ (4/49) రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.

2-2తో సిరిస్ సమం

2-2తో సిరిస్ సమం

399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

Story first published: Monday, September 16, 2019, 11:33 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X