న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌కు ముందు వార్నర్‌కు గాయం: ఆసీస్ జట్టులో ఆందోళన

Ashes 2019 : David Warner in injury scare ahead 1st England vs Australia Test || Oneindia Telugu
 The Ashes: David Warner in injury scare ahead 1st England vs Australia Test

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం ఆస్ట్రేలియా జట్టుని ఆందోళనకు గురి చేస్తోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ ఆగస్టు 1(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కి బర్మింగ్ హామ్ ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు బర్మింగ్ హామ్‌కు చేరుకుంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మీడియం పేసర్ మైకేల్ నెసర్ వేసిన బంతికి డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ ఎడమ తొడను బంతి బలంగా తాకడంతో నెట్స్‌ను వీడాడు. వెంటనే మెడికల్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి డేవిడ్ వార్నర్‌‌ గాయానికి ఐస్ పెట్టడంతో కాస్త ఉపశమం పొందాడు.

గాయం నుంచి కోలుకునేందుకు

గాయం నుంచి కోలుకునేందుకు

అయితే, ఈ గాయం నుంచి వార్నర్ పూర్తిగా కొలుకునేందుకు మరి కొన్ని రోజులు పట్టొచ్చు. బర్మింగ్ హామ్ వేదికగా జరిగే తొలి టెస్టులో డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా కీలకం కానున్నాడు. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం వార్నర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆసీస్ జట్టు సెమీస్‌కు చేరుకోవడంలో వార్నర్‌దే కీలకపాత్ర.

ప్రపంచకప్‌లో రెండో అత్యధిక పరుగులు

ప్రపంచకప్‌లో రెండో అత్యధిక పరుగులు

ప్రపంచకప్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 647 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ రెండో ఆత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. అందులో 33 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

ఐదు సిరీస్‌లు డ్రాగా

ఐదు సిరీస్‌లు డ్రాగా

ఇక, ఇంగ్లాండ్‌ 32 సార్లు విజయం సాధించింది. ఐదు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఇక, ఇంగ్లీషు గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్ నెగ్గి సరిగ్గా 18 ఏళ్లవుతోంది. 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో ట్రోఫీని నెగ్గిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో యాషెస్ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా ఇంగ్లాండ్‌ నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చింది.

ఆస్ట్రేలియా నాలుగింట విజయం

ఆస్ట్రేలియా నాలుగింట విజయం

అందులో సొంతగడ్డపై జరిగిన ఐదు యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా నాలుగింట విజయం సాధించి ఒకటి దాంట్లో ఓడిపోయింది. అయితే, ఈసారి యాషెస్ కాస్త భిన్నంగా జరుగుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు గాను ఐసీసీ ప్రవేశ పెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే మొదలవుతుండటం విశేషం.

యాషెస్ సిరిస్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్

యాషెస్ సిరిస్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్

ఈ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 9 జట్లు పోటీలో పాల్గొంటాయి. రెండేళ్లలో 71 మ్యాచులు, 27 సిరీస్‌లు జరుగుతాయి. చివరిగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లాండ్ వేదికగా 2021, జూన్‌న జరగనున్న పైనల్లో తలపడతాయి. 1989-2003 మధ్య కాలంలో జరిగిన ఎనిమిది యాషెస్‌ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా వరుస విజయాల పరంపరను కొనసాగించింది.

Story first published: Tuesday, July 30, 2019, 15:54 [IST]
Other articles published on Jul 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X