న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా-ఏ జట్టులో రోహిత్, రహానే, షా: ప్రాక్టీస్ కోసమేనన్న ద్రవిడ్

India vs Australia : Test Squad For The Australian Tour Now In India A Squad | Oneindia Telugu
The A tour to NZ will be good for Test regulars: Rahul Dravid

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పోలిస్తే న్యూజిలాండ్‌లో పిరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఇండియా-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనలో భాగంగా త్వరలో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆసీస్ పర్యటనకు బయల్దేరనుంది.

తప్పు నాదే!: యువరాజ్ కుక్కతో పోల్చడంపై అంగద్ బేడీతప్పు నాదే!: యువరాజ్ కుక్కతో పోల్చడంపై అంగద్ బేడీ

ఈ పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. ఆసీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు మరింత ప్రాక్టీస్ కావాలని భావించిన బీసీసీఐ వారికి ఇండియా-ఏ జట్టులో చోటు కల్పించింది.

ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు సీనియర్లు

ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు సీనియర్లు

ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న టెస్టు ఆటగాళ్లలో రహానే, మురళీ విజయ్, రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, పార్థివ్‌ పటేల్, హనుమ విహారిలు ఉన్నారు. వీరంతా కూడా నవంబర్ 16 నుంచి న్యూజిలాండ్-ఏతో మౌంట్‌ మాంగనీలో జరిగే నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ తరుపున బరిలోకి దిగనున్నారు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ కోసం ప్రకటించిన జట్టులో

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ కోసం ప్రకటించిన జట్టులో

ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ కోసం ప్రకటించిన జట్టులో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో పోలిస్తే న్యూజిలాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అయితే ప్రాక్టీస్‌ పరంగా మాత్రం ఇది సీనియర్లకు ఉపకరిస్తుందని చెప్పాడు.

 రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ

రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ

"ఇండియా-ఏ జట్టు తరఫున ఆడబోతున్న సీనియర్లకు ఇది మంచి అవకాశం. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితేనేం వారందరికీ మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుంది. ఇటీవల బిజీ షెడ్యూల్‌ల కారణంగా ప్రాక్టీస్‌ గేమ్‌లకు ఎక్కువగా అవకాశం ఉండటం లేదు" అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

ఇండియా-ఏ మ్యాచ్‌లు కూడా పోటాపోటీగా

ఇండియా-ఏ మ్యాచ్‌లు కూడా పోటాపోటీగా

"పైగా ఇండియా-ఏ మ్యాచ్‌లు కూడా పోటాపోటీగా సాగుతున్నాయి. దానిని బట్టి చూస్తే ప్రధాన సిరీస్‌కు ముందు ఇలాంటి మ్యాచ్‌ మేలు చేస్తుంది" అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత అద్భుత ప్రదర్శన చేస్తోందని, దీంతో ఇండియా-ఏ పర్యటనల్లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఉండేలా చూసుకుంటున్నామని ద్రవిడ్‌ చెప్పాడు.

Story first published: Tuesday, November 13, 2018, 14:37 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X