న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PHOTOS: మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరిస్‌‌లో ధరించే జర్సీ ఇదే!

Tendulkar on Ganguly: He will serve the nation with same passion

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అమితమైన ప్రేమతో దేశానికి సేవ చేస్తాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరిస్‌కు సంబంధించిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్, జాంటీ రోడ్స్, బ్రెట్ లీ, దిలకరత్నే దిల్షాన్, జాంటీ రోడ్స్‌లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పనితనం ఎలా ఉండబోతుందని సచిన్ టెండూల్కర్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా "అతడు క్రికెట్ ఆడిన విధానం... అతడు వెళ్లిన విధానం కూడా దేశానికి ఉపయోగపడింది. కెప్టెన్‌గా ఎలాగైతే టీమిండియాను విజయాల బాట పట్టించాడో అదే అభిరుచితో దేశానికి సేవ చేస్తాడు" అని చెప్పుకొచ్చాడు.

<strong>డే-నైట్ టెస్టుల్లో కూడా టీమిండియా విజయం సాధిస్తుంది: సౌరవ్ గంగూలీ</strong>డే-నైట్ టెస్టుల్లో కూడా టీమిండియా విజయం సాధిస్తుంది: సౌరవ్ గంగూలీ

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో

ఇది ఇతర క్రికెటర్లను పరిపాలన చేపట్టడానికి ప్రోత్సహిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు "అది వాళ్ల వ్యక్తిగతం" అని సచిన్ సమాధానమిచ్చాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది జరిగే టీ20 టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు వెస్టిండిస్ దిగ్గజం బ్రియానా లారాలతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బౌలింగ్ గ్రేట్ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌లు ఈ టోర్నీలో ఆడనున్నారు.

ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు

ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 మధ్యలో జరిగే ఈ టోర్నమెంట్‌లో ఆటగాళ్లందరూ జట్లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. మళ్లీ బ్యాట్ పట్టేందుకు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు సచిన్ చెప్పుకొచ్చాడు.

ఓ షార్ట్ ఫిల్మ్‌ని కూడా రూపొందించాం

ఓ షార్ట్ ఫిల్మ్‌ని కూడా రూపొందించాం

"ఈ సిరిస్ కోసం నాతో పాటు మిగతా క్రికెటర్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో నిన్న ఓ షార్ట్ ఫిల్మ్‌ని కూడా రూపొందించాం. చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం కొత్త అనుభూతినిస్తోంది. మైదానంలో నడిచిన ప్రతిసారీ అదొక అందమైన అనుభూతి" అని సచిన్ తెలిపాడు.

మైదానం బయట మేమంతా స్నేహితులం

మైదానం బయట మేమంతా స్నేహితులం

"మేము మైదానంలో ఒకరినొకరు నెట్టివేసుకుని, చాలా కష్టపడి పోటీ పడుతూ ఉండొచ్చు, కానీ మైదానం బయట మాత్రం మేమంతా మంచి స్నేహితులం" అని సచిన్ అన్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ తిరిగి బ్యాట్ పట్టడం ఇది మూడోసారి. 2014లో లార్డ్స్ వేదికగా రెస్టాఫ్ ద వరల్డ్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఎంసీసీ జట్టు తరుపున సచిన్ ఆడాడు.

మూడోసారి బరిలోకి

మూడోసారి బరిలోకి

ఆ తర్వాత 2015లో అమెరిగా వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో సచిన దర్శనమిచ్చాడు. సచిన్ గనుక మళ్లీ బరిలోకి దిగితే స్టేడియం మొత్తం సచిన్-సచిన్ అనే నినాదాలతో హోరెత్తుతుంది. 2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండిస్‌తో తన 200వ టెస్టు మ్యాచ్‌ని ఆడిన తర్వాత సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అక్టోబర్ 23న అధ్యక్ష బాధ్యతలు

అక్టోబర్ 23న అధ్యక్ష బాధ్యతలు

ఇదిలా ఉంటే, బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సోమవారం దాదా తన నామినేషన్ పత్రాలను సమర్పించి సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే.

Story first published: Thursday, October 17, 2019, 17:33 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X