న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకు ఆలస్యం.. నోట్స్‌కు నేను సిద్ధం: సచిన్‌-ఫెదరర్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

By Nageshwara Rao
Tendulkar offers Federer help with straight drive... in exchange for backhand advice

హైదరాబాద్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్... క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరూ పరస్పరం సాయం చేసుకోనున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

అసలేం జరిగింది?
రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్‌ టైటిల్‌పై గురి పెట్టిన స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ సోమవారం ప్రిక్వార్టర్స్‌లో భాగంగా మన్నారినో(ఫ్రాన్స్‌)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్ టెన్నిస్ బంతితో క్రికెట్‌ తరహా ఢిఫెన్స్‌ షాట్‌ ఆడాడు. దీంతో మ్యాచ్‌ చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వింబుల్డన్‌ నిర్వాహకులు రోజర్ ఫెదరర్‌ ఆడిన షాట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకుని రేటింగ్‌ ఇవ్వాల్సిందిగా ఐసీసీని కోరింది. ఇందుకు స్పందించిన ఐసీసీ టెస్టుల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకును ఇచ్చినట్లు తెలిపింది. ఐసీసీ ఇచ్చిన ర్యాంకుపై సచిన్ కూడా స్పందించాడు.

"ఫెదరర్‌ చేతికి-కంటికి ఎప్పుడూ మంచి కో ఆర్డినేషన్‌ ఉంటుంది. ఫెదరర్‌ నువ్వు తొమ్మిదో వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం ఇద్దరం టెన్నిస్‌-క్రికెట్‌ గురించి మాట్లాడుకుందాం" అని సచిన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

దీనికి ఫెదరర్‌ స్పందిస్తూ "ఎందుకు ఎదురుచూడాలి? నేను నోట్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను" అని బదులిచ్చాడు. అనంతరం ఫెదరర్ ట్వీట్‌కు సచిన్ టెండూల్కర్ బదులిస్తూ "అయితే, సరే ఫెదరర్‌. స్ట్రయిట్‌ డ్రైవ్‌ గురించి మొదటి పాఠం. ఈ ఏడాది వింబుల్డన్‌లో నీ ఆటను ప్రత్యక్షంగా వచ్చి చూడలేకపోతున్నాను. టీవీలో చూస్తున్నాను. వచ్చే ఏడాది రావడానికి ప్రయత్నిస్తా. ఆల్‌ ద వెరీ బెస్ట్‌" అని సచిన్‌ అన్నాడు.

వరుసగా 20వసారి వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న ఫెదరర్‌ 16వసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. మొత్తంగా ఫెదరర్ తన కెరీర్‌లో 53వసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్‌ తలపడనున్నాడు.

ప్రీక్వార్టర్స్‌లో ఫెదరర్ 6-0, 7-5, 6-4తో ఫ్రాన్స్‌ క్రీడాకారుడు అడ్రియన్‌ మనారినోపై వరుససెట్లలో విజయం సాధించాడు. తొలిసెట్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌కు కూడా అవకాశమివ్వని ఫెదరర్.. ఆ సెట్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించి సత్తా చాటాడు. ఎనిమిదిసార్లు వింబుల్డన్‌ విజేత అయిన 36 ఏళ్ల ఫెడరర్‌కిది వరుసగా 32వ సెట్‌ విజయం.

Story first published: Wednesday, July 11, 2018, 15:09 [IST]
Other articles published on Jul 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X