న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సచిన్ సాగా క్రికెట్ ఛాంపియన్స్': డిజిటల్ గేమ్ రూపంలో సచిన్ చరిత్ర

By Nageshwara Rao
Tendulkar launches ‘Sachin Saga Cricket Champions’

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను డిజిటల్ గేమ్ రూపంలో అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే తన జీవిత విశేషాలను సినిమా రూపంలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌, గేమింగ్ కంపెనీ సంస్థ జెట్‌సింథేసిస్‌ రూపొందించిన ఈ డిజిటల్‌ గేమ్‌ను సచిన్‌ టెండూల్కర్ గురువారం బెంగళూరులో ఆవిష్కరించాడు. 'సచిన్‌ సాగా క్రికెట్‌ ఛాంపియన్స్‌' పేరిట విడుదలైన ఈ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌లో సచిన్‌ జీవిత విశేషాలతోపాటు, క్రికెట్‌ స్టైల్‌, మ్యాచ్ గణాంకాలను పొందుపరిచారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ 'నా అభిమానులను ఒకరికొకరిని చేరువ చేయడంతో పాటు నా జీవిత పయనాన్ని వారితో పంచుకోవడమే ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లక్ష్యం' అని సచిన్‌ చెప్పాడు. ఈ డిజిటల్ గేమింగ్ ద్వారా అభిమానులు ఎంతగానో ఎంటర్టైన్ అవ్వొచ్చని సచిన్ తెలిపాడు.

తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో పార్లర్లకు తరచూ వెళ్లి వీడియో గేమ్‌లు ఆడే వాడినని సచిన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం జెట్‌సింథేసిస్‌ రెండేళ్లు అధ్యయనం చేసిందని సచిన్ వెల్లడించాడు. తన బ్యాటింగ్‌ను జేమ్స్‌బాండ్‌ చిత్రం షూటింగ్‌ చేసిన లండన్‌లోని ఓ హైటెక్‌ స్టూడియోలో చిత్రీకరించిందని సచిన్ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 12:26 [IST]
Other articles published on Dec 8, 2017
Read in English: Tendulkar unveils new game
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X