న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండిపెండెన్స్ డే విషెస్ తెలియజేసిన క్రీడాకారులు

Independence Day 2018 : India's Sporting Icons Lead Wishes On Social Media
Tendulkar, Kumble lead wishes from sportspersons on Indias Independence Day

హైదరాబాద్: ఆగష్టు 15 బుధవారం నాటికి భారత దేశ స్వాతంత్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహోన్నతమైన రోజును పురస్కరించుకొని స్వతంత్ర్య భారతావనిలోని ప్రతి పౌరుడు ఇంకొకరితో శుభాకాంక్షలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు తమ అభిమానులకు తెలిపారు. సచిన్ టెండూల్కర్ తన ట్వీట్‌లో సమర యోధుల గురించి ప్రస్తావించారు.

'జీవితంలో ప్రతి విషయం ఎంతో కష్టపడి సాధించుకున్నట్లే.. భారత దేశ స్వాతంత్రం కూడా అంతకంటే ఎక్కువ శ్రమించి సంపాదించుకున్నాం. దీనికోసం ఎందరో సమరయోధులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారు'

భారత బౌలర్లలో ఎంతో చాకచక్యంగా బౌలింగ్ వేసే అనిల్ కుంబ్లే.. భారత జట్టు కోచ్‌గా పని చేసిన అతను సింపుల్ విషెస్‌తో ముగించాడు. అతని శైలిలో స్పందించిన అనిల్ కుంబ్లే హ్యాపీ ఇండిపెండెన్స్ డే . జై హింద్! అని ముగించారు.

వీరితో పాటు కొందరు విదేశీ క్రికెటర్లు సైతం భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. లంక క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్.. నేపాల్ క్రికెటర్ సందీప్ లామించానెలు తమ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ఆకాశ్ చోప్రాలతో పాటు ప్రస్తుత భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తన శుభాకాంక్షలు అందజేశారు.

మిగిలిన క్రికెటర్లు షమీతో పాటు వింటర్ ఒలింపిక్స్‌లో స్వర్ణ విజేత మానికా బాత్రా, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు ఇండోనేషియాలోని జకార్తాకు చేరిన భారత బృందం తమ శుభాకాంక్షలు భారత వాసులకు పంపారు.

Story first published: Wednesday, August 15, 2018, 15:08 [IST]
Other articles published on Aug 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X