న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ 2019.. నాలుగో స్థానం సమిష్టి నిర్ణయం: బంగర్

Team management and selectors were part of decision on World CUp No 4 spot says Sanjay Bangar

ఢిల్లీ: ప్రపంచకప్‌ 2019లో నాలుగో స్థానంలో ఎవరు ఆడాలన్నది జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల సమిష్టి నిర్ణయం అని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పష్టం చేశారు. ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడటానికి ప్రధాన కారణం నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేకపోవడం. ఇక ఐదేళ్లలో నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని తయారు చేయడంలో విఫలం కావడంతో బంగర్‌పై వేటు పడింది.

<strong>పోలీసు ఉద్యోగానికి రాజీనామా.. ఎన్నికల బరిలో రెజ్లర్ బబితా ఫోగాట్?</strong>పోలీసు ఉద్యోగానికి రాజీనామా.. ఎన్నికల బరిలో రెజ్లర్ బబితా ఫోగాట్?

సమిష్టి నిర్ణయం:

సమిష్టి నిర్ణయం:

తాజాగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ... ' నాలుగో స్థానంలో ఎవరు ఆడాలన్నది జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల సమిష్టి నిర్ణయం. ఫామ్, ఫిట్ నెస్, బ్యాటింగ్ శైలి అన్ని పరిగణలోకి తీసుకున్నాం. నా సొంత నిర్ణయం అయితే కాదు. బ్యాటింగ్ కోచ్ పదవి నుండి తప్పించడం బాధగా ఉంది. అయితే ఆ బాధ కొన్ని రోజులు మాత్రమే. ఐదేళ్లు భారత జట్టుకు సేవలందించాను. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, డంకన్ ఫ్లెచర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలకు ధన్యవాదాలు' తెలిపాడు.

కోచ్‌ల గతం గురించి పట్టించుకోరు:

కోచ్‌ల గతం గురించి పట్టించుకోరు:

'సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీతో అమర్యాదగా ప్రవర్తించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ఎంపిక ప్రక్రియ ముగిసిన మూడు రోజుల తర్వాత తన ప్రజెంటేషన్‌పై మర్యాదగా ఆయనతో చర్చించా. తమ ఇద్దరి మధ్య గొడవపై వచ్చిన వార్తలన్నీ నిరాధారం. జట్టుతో ఐదేళ్లు విదేశాల్లో పర్యటించాను కాబట్టి ఇప్పట్లో బయట జట్లకు కోచింగ్‌ ఇచ్చే అవకాశం లేదు. ఆటగాళ్లు తమ భవిష్యత్తు చూసుకుంటారు గానీ.. కోచ్‌ల గతం గురించి పట్టించుకోరు' అని బంగర్ అన్నాడు.

రహానేకు కోహ్లీ అనేక అవకాశాలు ఇచ్చాడు:

రహానేకు కోహ్లీ అనేక అవకాశాలు ఇచ్చాడు:

'రహానేకు కెప్టెన్ కోహ్లీ అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. గత 18 నెలలుగా రహానే అర్ధ శతకాలను శతకాలుగా మార్చలేకపోయాడు. అయినప్పటికీ విదేశీ పిచ్‌లపై మంచి విజయాలు అందించాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో అతడు శతకం చేయడం సంతోషకరం. రిషభ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో అందరి అంచనాలను తారుమారు చేశాడు. అతను ఆలోచించి ఆడే క్రికెటర్‌. పేసర్లపై దాడి చేసేందుకు సాహసం చేస్తాడు. వన్డే క్రికెట్‌ను అర్థం చేసుకోవడానికి యువకులకు కాస్త సమయం పడుతుంది' అని బంగర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, September 12, 2019, 14:30 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X