న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: పెళ్లికి సిద్ధమైన టీమిండియా స్టార్ బ్యాటర్.. బంగ్లా టూర్ తర్వాత మూడు ముళ్లు!

Team India star KL Rahul takes personal leave to get married

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటి వాడు అవ్వబోతున్నట్లు సమాచారం. అసలు ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవాలని రాహుల్ అనుకున్నాడట. కానీ అది కుదర్లేదు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

బంగ్లా టూర్ తర్వాత..

బంగ్లా టూర్ తర్వాత..

ఈ పర్యటన ముగిసిన తర్వాత పెళ్లి పనులు పెట్టుకోవాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నాడట. ఇదే విషయాన్ని చెప్పిన రాహుల్.. తనకు వ్యక్తిగత సెలవు కావాలని కోరగా బీసీసీఐ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి తొలి వారంలోనే రాహుల్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. అంటే శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు అతను దూరం అవుతాడు. ఈ పెళ్లి తంతు పూర్తయిన తర్వాత మళ్లీ జట్టుతో కలుస్తాడని సమాచారం.

సునీల్ శెట్టి హింట్..

సునీల్ శెట్టి హింట్..

సుమారు మూడేళ్లుగా బాలీవుడ్ భామ అతియా శెట్టితో రాహుల్ ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ విషయం గురించి అతియా తండ్రి, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి స్పందించాడు. ఇద్దరి షెడ్యూల్‌లకు అనుగుణంగా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేలా పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తున్నట్లు సునీల్ శెట్టి చెప్పాడు. ఖాండ్లాలో సునీల్ శెట్టికి చెందిన లగ్జరీ విల్లాలో ఈ వివాహం జరుగుతుందట. ఈ వేడుకకు బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.

వరల్డ్ కప్‌లో విఫలం..

వరల్డ్ కప్‌లో విఫలం..

టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత చెత్తగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్.. ముఖ్యంగా పవర్‌ప్లేలో డిఫెన్సివ్‌ ఆటతీరుతో విమర్శలపాలయ్యాడు. అసలు రాహుల్ వంటి వాడిని టీ20 వరల్డ్ కప్‌ కోసం ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్సులు ఆడిన రాహుల్ రెండు హాఫ్ సెంచరీలతో 128 పరుగులు చేశాడు. అంటే మిగతా నాలుగు మ్యాచుల్లో కలిపి అతను చేసింది 20పైగా పరుగులే అన్నమాట. జింబాబ్వే, బంగ్లాదేశ్ మీద అతను రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

Story first published: Friday, December 2, 2022, 12:04 [IST]
Other articles published on Dec 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X