న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NCA జిమ్‌లో టీమిండియా 'స్వాడ్ గోల్స్': ద్రవిడ్‌తో కోహ్లీ

Team India players were seen sweating it out in the NCA gym in Bengaluru

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాయి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడో టీ20లో విజయం సాధించాలని నెట్స్‌లో తెగ శ్రమిస్తోంది.

సఫారీ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా అటు టీ20 క్రికెటర్లతో పాటు.. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు సైతం ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నారు.

ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఆల్ టైమ్ టీ20 రికార్డు నెలకొల్పాడుఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఆల్ టైమ్ టీ20 రికార్డు నెలకొల్పాడు

కోహ్లీతో పాటు

కోహ్లీతో పాటు

కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీ, శ్రేయాస్ అయ్యర్‌లు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న జిమ్‌లో కాసేపు కసరత్తులు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ కూడా ఆటగాళ్లతో జతకలిశాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తోన్న ఫోటోని ధావన్ ఇనిస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

స్వాడ్ గోల్స్' అంటూ ధావన్ కామెంట్

అంతేకాదు ఆ పోస్టుకు 'స్వాడ్ గోల్స్' అంటూ కామెంట్ కూడా పెట్టాడు. మరోవైపు నెట్ ప్రాక్టీస్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీలో కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ద్రవిడ్‌తో కోహ్లీ

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం మూడో టీ20లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అక్టోబర్ 2న తొలి టెస్టు

అక్టోబర్ 2న తొలి టెస్టు

టీ20 సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ టెస్టు సిరిస్‌లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్వవహారిస్తోన్న రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

Story first published: Saturday, September 21, 2019, 12:49 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X