న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?

 Team India needs these answers before eyeing the series

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవయినా.. రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపడంతో భారత జట్టు జయభేరి మోగించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేదు. న్యూజిల్యాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. ఇదే ఇప్పుడు రెండు జట్లకు తలనొప్పి తెప్పిస్తున్న ప్రశ్న.

 కివీస్ సమస్యలివే..

కివీస్ సమస్యలివే..

న్యూజిల్యాండ్ జట్టు ఆడిన చివరి ఐదు టీ20ల్లో పవర్‌ప్లేలో నాలుగు సార్లు కేవలం 40 అంతకంటే తక్కువ పరుగులే చేయగలిగారు. అంతేకాదు ఈ మ్యాచులన్నీ కలిపినా కొట్టింది రెండు సిక్సర్లే. అవి కూడా యువ ఓపెనర్ ఫిన్ అలెన్ బాదినవే. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అదే సమయంలో వన్ డౌన్‌లో వచ్చే కేన్ విలియమ్సన్ కూడా నిదానంగా ఆడటంతో కివీస్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లపై భారం పడుతోంది.

కివీ బౌలింగ్ లైనప్ కూడా అంత మెరుగైన స్థితిలో లేదు. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. అయితే వరల్డ్ కప్‌లో కూడా కివీ బౌలర్లు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పుడు బౌల్ట్ కూడా లేడు. సౌథీ కూడా మరికొన్ని రోజుల్లో 34వ పడిలో అడుగు పెడతాడు. దీంతో న్యూజిల్యాండ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

 టీమిండియాకూ అవే కష్టాలు..

టీమిండియాకూ అవే కష్టాలు..

భారత్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. టీమిండియా టాపార్డర్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముగ్గురూ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. దీంతో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ఇంటెంట్ చూపించాలని టీమిండియా అనుకుంది. అందుకే ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ జోడీని ఓపెనింగ్‌కు పంపింది.

అయితే వీళ్లిద్దరూ కూడా ఆకట్టుకోలేకపోయారు. పంత్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 36 పరుగులు చేసినా.. దానికోసం 30 బంతులు ఎదుర్కొన్నాడు. వీటిలో 26 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. అంటే అతను ఎన్ని డాట్ బాల్స్ ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టాపార్డర్‌లో సంజూ శాంసన్ వంటి బిగ్ హిట్టర్‌ను ఆడించాలని డిమాండ్ పెరుగుతోంది.

ఫినిషర్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా..

ఫినిషర్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా..

అలాగే టీమిండియా ఫినిషర్ రోల్ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది. రెండో టీ20లో ఈ బాధ్యతను దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లకు పాండ్యా అప్పజెప్పాడు. వీళ్లిద్దరూ ఈ పాత్రను పోషించడంలో విఫలమయ్యారు. దీంతో పాండ్యనే ఈ పాత్రకు న్యాయం చేయగలడనే వాదనకు మరింత బలం చేకూరుతోంది.

రెండో టీ20లో భారత జట్టు బౌలింగ్ అద్భుతంగా రాణించినా.. ఆ బృందంలో వావ్ ఫ్యాక్టర్ లేదు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ తప్ప మిగతా బౌలర్లు కనీసం 140 కిలోమీటర్ల వేగం కూడా దాటడం లేదు. అందుకే ఉమ్రాన్ మాలిక్ పేస్‌ను కూడా జట్టులో ఉపయోగించుకోవాలని, తద్వారా ఆ వావ్ ఫ్యాక్టర్ జట్టుకు దక్కుతుందని మాజీలు అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో పాండ్య ఏ నిర్ణయం తీసుకుంటాడో.

Story first published: Tuesday, November 22, 2022, 11:53 [IST]
Other articles published on Nov 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X