న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్‌తో టెస్టు అంటే బీసీసీఐకి ఎందుకంత భయం!

By Nageshwara Rao
Team India must shed apprehensions about pink ball Tests, embrace the challenge: Harbhajan Singh

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీసేన డే అండ్ నైట్ టెస్ట్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడాన్ని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుపట్టాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్‌లో తొలి టెస్ట్‌ను డే అండ్ నైట్‌గా నిర్వహించాలన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

పింక్ బాల్ టెస్టుపై భజ్జీ

పింక్ బాల్ టెస్టుపై భజ్జీ

దీనిపై ఆసీస్ మాజీ దిగ్గజాలు మార్క్‌ వా, ఇయాన్‌ చాపెల్‌ సహా పలువురు ఆటగాళ్లు విమర్శలు గుప్పించగా... తాజాగా హర్భజన్ సింగ్ సైతం స్పందించాడు. బొరియా మొజుందార్ రాసిన పుస్తకం ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్ ప్రచార కార్యక్రమంలో భజ్జీతో పాటు గౌతమ్ గంభీర్, సీవోఏ చీఫ్ వినోద్ రాయ్, సీఈవో రాహుల్ జోహ్రీ పాల్గొన్నారు.

బీసీసీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నదో అర్థం కావడంలేదు

బీసీసీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నదో అర్థం కావడంలేదు

ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ 'నేను పింక్ బాల్‌తో ఆడాలనే సూచిస్తా. డే అండ్ నైట్ టెస్ట్‌లను బీసీసీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నదో అర్థం కావడంలేదు. అది ఆసక్తికర ఫార్మాట్, మనం ఆడి చూడాలి. పింక్ బాల్‌తో ఆడేందుకు బీసీసీఐకి అంత భయమెందుకు..? ఒకసారి ఆడితే, అదే అలవాటవుతుంది. అదంత కష్టమేమీ కాదు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇదో వినూత్న విధానం. దానిని నేను సమర్థిస్తున్నా' అని భజ్జీ అన్నాడు.

గెలుపు సాధ్యపడే అవకాశం భారత్‌కు

గెలుపు సాధ్యపడే అవకాశం భారత్‌కు

ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన సీవోఏ చీఫ్ వినోద్‌రాయ్ మాట్లాడుతూ 'అన్ని మ్యాచ్‌లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్‌ మ్యాచ్‌లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే అండ్ నైట్‌ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం' అని అన్నాడు. రాయ్ మాటలపై స్పందించిన భజ్జీ భారత్ ఆటగాళ్లు హేజల్‌వుడ్, స్టార్క్ బౌలింగ్‌లో ఔటైతే పెద్ద నష్టమేమీ ఉండదని, మనకూ బౌలర్లు ఉన్నారు కదా? అని ప్రశ్నించాడు.

ఆసీస్‌లో భారత్ పర్యటనకు స్మిత్, వార్నర్ దూరం

ఆసీస్‌లో భారత్ పర్యటనకు స్మిత్, వార్నర్ దూరం

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌తో భారత్‌ తన పర్యటనను ప్రారంభించనుంది. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు జరగనుంది. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆడే మూడు సిరిస్‌ల్లో కూడా ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆడరు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి, 2019లో ముగియనుంది. దీంతో వీరిద్దరూ ఈ సిరీస్‌కు దూరం కానున్నారు.

Story first published: Friday, May 18, 2018, 13:11 [IST]
Other articles published on May 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X