న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: మొదట బౌలింగ్ చేయనున్న టీమిండియా.. మళ్లీ సంజూకు మొండిచెయ్యే..!

Team India makes a single change in third INDvsNZ T20I leaves out Sanju once again

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తాత్కాలిక కెప్టెన్ టిమ్ సౌథీ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. గత మ్యాచ్‌లో కూడా తాము బౌలింగ్ బాగానే చేశామని, ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ సారధి కేన్ విలియమ్సన్ ఆడటం లేదు. గతంలో తీసుకున్న మెడికల్ అపాయింట్‌మెంట్ ఉండటంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆటగాడు మార్క్ చాప్‌మాన్‌ను తీసుకున్నట్లు సౌథీ వెల్లడించాడు.

పాండ్య ఏమన్నాడంటే?

పాండ్య ఏమన్నాడంటే?

సౌథీ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా సారధి హార్దిక్ పాండ్యా కూడా సంతోషం వ్యక్తం చేశాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని చెప్పాడు. పిచ్‌ కొద్దిగా పచ్చగా ఉందని, దీని వల్ల పేసర్లకు కొంత మూవ్‌మెంట్ దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు. నేపియర్ మైదానంలో స్క్వేర్ బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ విషయంపై పెద్దగా ఆలోచించడం లేదని పాండ్యా వెల్లడించాడు. తమ బౌలర్లు, బ్యాటర్ల సత్తాపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. ఇలాంటి పిచ్‌పై అన్నీ మన చేతుల్లో ఉండవని, కాబట్టి అంతగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

ఒకటే మార్పు..

జట్టులో ఒకే ఒక మార్పు ఉందని చెప్పిన హార్దిక్ పాండ్యా.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. ఇది విన్న ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఏడాది ఆరంభం నుంచి టీమిండియా తరఫున ఆడిన ప్రతి మ్యాచులోనూ సత్తా చాటుతున్న సంజూ శాంసన్‌కు ఈ మ్యాచులో అయినా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా వరుసగా విఫలం అవుతున్న పంత్ స్థానంలో అతన్ని తీసుకుంటారని అనుకున్నారు.

ఉమ్రాన్‌కూ మొండిచెయ్యే..

ఉమ్రాన్‌కూ మొండిచెయ్యే..

అలాగే భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు కూడా భారత జట్టులో చోటు దక్కలేదు. వచ్చే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతన్ని మెరుగైన పేసర్‌గా మార్చేందుకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వాలని మాజీలంతా అభిప్రాయపడ్డారు. దానికి న్యూజిల్యాండ్ సిరీస్‌లోనే భారత జట్టు శ్రీకారం చుడుతుందని ఆశించారు. కానీ పాండ్యా మాత్రం సంజూ, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం ఇవ్వలేదు.

వర్షం దోబూచులాట..

వర్షం దోబూచులాట..

టాస్‌కు ముందు వర్షం పడటంతో ఈ మ్యాచ్‌ కొంత ఆలస్యమైంది. టాస్ తర్వాత మ్యాచ్ ప్రారంభానికి ముందు మరోసారి జల్లులు పడటం ప్రారంభమయ్యాయి. దీంతో మరోసారి ఆట ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఓవర్లలో కోత పడే అవకాశం ఉంది.

భారత జట్టు: ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్

న్యూజిల్యాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్‌మాన్, గ్లెన్ ఫిలిప్స్, డారియల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, ఐష్ సోధి, టిమ్ సౌథీ (కెప్టెన్), లోకీ ఫెర్గూసన్

Story first published: Tuesday, November 22, 2022, 12:26 [IST]
Other articles published on Nov 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X