న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: కోచ్‌కు రెస్ట్ ఎందుకో అర్థం కావట్లేదు?.. ద్రావిడ్‌పై చురకలేసిన మాజీ లెజెండ్

Team India former coach Ravi Shastri takes a dig at Rahul Dravid for missing INDvsNZ series

ఇటీవలి కాలంలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు సిరీస్‌ల మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఎక్కువైపోయింది. దీంతో వారిపై మాజీలు మండి పడుతున్నారు. అంతగా అలిసిపోతే ఐపీఎల్ మానుకోవాలి కానీ.. దేశం తరఫున ఆడే సమయంలో విశ్రాంతి ఏంటి? అని నిలదీస్తున్నారు. అయితే ఆటగాళ్లతోపాటు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కొన్ని సిరీసుల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీన్ని ఎవరూ పెద్దగా వేలెత్తి చూపలేదు. అయితే ఇప్పుడు టీమిండియా మాజీ కోచ్, లెజెండరీ క్రికెటర్ రవిశాస్త్రి ఈ విషయాన్ని ప్రస్తావించాడు. రాహుల్ ద్రావిడ్‌పై పరోక్షంగా చురకలేశాడు.

కోచ్‌కు అవసరం లేదు

కోచ్‌కు అవసరం లేదు

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఓడిన టీమిండియా.. కివీస్‌తో టీ20, వన్డే సిరీస్‌ల కోసం న్యూజిల్యాండ్ వెళ్లింది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లీ తదితర వెటరన్లు దూరమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఎన్సీయే డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ సిరీస్‌లో భారత కోచ్‌గా బాధ్యతలు అప్పగించారు. దీన్ని తప్పుబట్టిన రవిశాస్త్రి.. కోచ్‌కు ప్రత్యేకంగా విశ్రాంతి అక్కర్లేదన్నాడు. జట్టును మరింత బాగా తెలుసునేందుకు కృషి చేయాలని, అలాంటి సమయంలో విశ్రాంతి ఎందుకో తనకు అర్థం కావడం లేదని చురకలేశాడు.

ఐర్లాండ్ సిరీస్‌కూ రాహుల్ దూరం..

ఐర్లాండ్ సిరీస్‌కూ రాహుల్ దూరం..

గతంలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటన సమయంలో కూడా రాహుల్ ద్రావిడ్ అక్కడకు వెళ్లలేదు. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు మ్యాచ్ ఉండటంతో.. ద్రావిడ్ అక్కడకు వెళ్లాడు. దీంతో ఐర్లాండ్‌కు కూడా లక్ష్మణే వెళ్లాడు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''నేను ఈ బ్రేక్స్‌ను నమ్మను. వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకోను. ఎందుకంటే.. నేనైతే నా టీంను అర్థం చేసుకోవడానికి, ప్లేయర్లను తెలుసుకోవడాని ప్రయత్నిస్తా'' అని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ టైంలో అంతా రెస్టే కదా..!

ఐపీఎల్ టైంలో అంతా రెస్టే కదా..!

కోచ్‌లకు ప్రత్యేకంగా విశ్రాంతి ఎందుకు అవసరమో తనకు తెలియడం లేదన్న రవిశాస్త్రి.. ''ఐపీఎల్ సమయంలో రెండు నెలల పాటు కోచ్‌లకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ రెస్టే ఎక్కువ అని నా ఫీలింగ్. మిగతా టైంలో కోచ్‌గా ఎవరున్నా సరే వాళ్లు జట్టుతోనే ఉండాలనేది నా అభిప్రాయం'' అని తేల్చిచెప్పాడు. న్యూజిల్యాండ్ సిరీస్ తర్వాత భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్ వెళ్తుంది. ఆ సిరీస్‌కు కోహ్లీ, రోహిత్ సహా ద్రావిడ్ కూడా జట్టుతో చేరతారు.

Story first published: Friday, November 18, 2022, 9:49 [IST]
Other articles published on Nov 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X