నటరాజన్ బ్యాట్, ప్యాడ్లు లేకుండానే ఆసీస్‌కు వచ్చాడు: టీమిండియా ఫీల్డింగ్ కోచ్

న్యూఢిల్లీ: నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియా వెళ్లిన తమిళనాడు పేసర్ తంగరసు నటరాజన్ ఎవ్వరూ ఊహించని విధంగా మూడు ఫార్మాట్స్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ఈ తమిళనాడు ప్లేయర్ బ్యాట్, ప్యాడ్లు లేకుండా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడట. వన్డేలు, టీ20ల్లో బౌలింగ్‌కే పరిమితమైన నట్టూ గబ్బా టెస్ట్‌లో మాత్రం బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.

టీమ్‌కు సెలెక్ట్ అయ్యాక అశ్విన్, సుందర్‌లో ఒకరి నుంచి నట్టూ.. బ్యాట్, ప్యాడ్లు తీసుకున్నాడని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తెలిపాడు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చి ఇంటర్వ్యూలో శ్రీధర్ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత చాలా పెద్ద మేధోమథనమే నడిచిందన్నాడు.

బ్యాట్, ప్యాడ్లు లేకుండానే..

బ్యాట్, ప్యాడ్లు లేకుండానే..

‘మీకో విషయం తెలుసా. బ్యాట్, ప్యాడ్స్ లేకుండానే నటరాజన్ ఆసీస్ వచ్చేశాడు. నెట్‌బౌలర్‌గానే ఎంపికవ్వడంతో బౌలింగ్ స్పైక్స్, ట్రెయినర్లు మాత్రమే వెంట తెచ్చుకున్నాడు. కానీ టీమ్‌లోకి ఎంపికయ్యాక అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరి దగ్గరి నుంచి బ్యాట్, ప్యాడ్లను తీసుకున్నాడు. ఆ సంగతి ఎలా ఉన్నా అతను మామూలు నెట్ బౌలర్ మాత్రం కాదు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్, ట్రెయినర్ సోహమ్.. నెట్ బౌలర్ల కోసం స్పెషల్ ప్లాన్ అమలు చేస్తారు. నెట్ బౌలర్లను కూడా డ్రెస్సింగ్ రూమ్ మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తారు.

12 గంటలకు కోహ్లీ మెసేజ్

12 గంటలకు కోహ్లీ మెసేజ్

అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన అర్ధ‌రాత్రి 12.30 గంట‌లకు కోహ్లీ ఏం చేస్తున్నామని మెసేజ్ చేశాడు. ఈ స‌మ‌యంలో ఎందుకు మెసేజ్ చేశాడో అని నేను షాకయ్యా. హెడ్ కోచ్‌, నేను, భ‌ర‌త్ అరుణ్‌, విక్ర‌మ్ రాథోడ్ క‌లిసి ఉన్నామ‌ని చెప్పాను. నేను కూడా వ‌స్తాన‌ని అత‌న‌న్నాడు. ఆ వెంట‌నే కోహ్లీ కూడా వ‌చ్చాడు. అంద‌రం క‌లిసి మాట్లాడుకున్నాం. అప్పుడే మిష‌న్ మెల్‌బోర్న్ మొద‌లైంది.

 కోహ్లీ సూచనల మేరకే..

కోహ్లీ సూచనల మేరకే..

ఆ స‌మ‌యంలో ఈ 36ను ఓ బ్యాడ్జ్‌లా పెట్టుకోండి. ఈ 36 టీమ్‌ను మ‌ళ్లీ గొప్ప‌గా చేస్తుందని ర‌విశాస్త్రి అన్నాడు. ఆ త‌ర్వాత మెల్‌బోర్న్ టెస్ట్‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై మాట్లాడుకున్నాం. సాధార‌ణంగా ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా బ్యాటింగ్ బ‌లాన్ని పెంచాల‌ని అనుకుంటారు. కానీ కోహ్లి, ర‌విశాస్త్రి, ర‌హానే మాత్రం బౌలింగ్ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించారు. అందుకే కోహ్లీ స్థానంలో రవీంద్ర జ‌డేజాను తీసుకున్నాం. ఆ ప్లాన్ వ‌ర్క‌వుటైంది.

లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేలా..

లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేలా..

టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ‌ర్స్ ఎక్కువ‌గా ఉండాల‌ని ర‌విశాస్త్రి సూచించాడు. దీనివ‌ల్ల ఆస్ట్రేలియా బౌల‌ర్లు త‌మ లైన్ అండ్ లెంత్ త‌ప్పే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ అత‌ని ఆలోచ‌న‌. అప్పుడే టీమ్‌లోని ఐదుగురు బెస్ట్ బౌల‌ర్ల‌తో మెల్‌బోర్న్ ఆడాల‌ని నిర్ణ‌యించాం. ప్లేయ‌ర్స్‌ను నెగ‌టివ్ ఆలోచ‌న‌ల నుంచి దూరం చేయ‌డానికి ఓ రోజు ప్రాక్టీస్‌కు సెల‌వ‌చ్చి.. ఆట‌పాట‌ల‌తో వాళ్లు గ‌డిపేలా చేశాం.

మొత్తంగా ఈ వ్యూహాల‌న్నీ ఫ‌లించి.. మెల్‌బోర్న్‌తోపాటు ఆ త‌ర్వాత సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లోనూ టీమిండియా సంచ‌ల‌న ఆట‌తీరుతో విజయాలందుకుంది.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన డైనైట్ టెస్ట్‌లో భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 22, 2021, 13:15 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X