న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాస్ టేలర్ తీరు సరిలేదు: హఫీజ్ బౌలింగ్‌పై ఫిర్యాదు, సర్ఫాజ్ మండిపాటు

Taylors Actions Disgraceful: Sarfraz Lashes Out at New Zealand Batsman

హైదరాబాద్: న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ తీరు ఏ మాత్రం బాగా లేదని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 47 పరుగులతో విజయం సాధించింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 'హ్యాట్రిక్‌' తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>ఐసీసీ వరల్డ్ టీ20: భారత్ Vs కివీస్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్ ఇన్ఫో</strong>ఐసీసీ వరల్డ్ టీ20: భారత్ Vs కివీస్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్ ఇన్ఫో

అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ రాస్ టేలర్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్ తొలి ఓవర్ ముగియగానే అతడు చకింగ్ చేస్తున్నాడంటూ రాస్ టేలర్ ఫిర్యాదు చేయడం వీడియోల్లో కనిపించింది. దీనిపై సర్ఫరాజ్ వెంటనే అంపైర్ల దగ్గరకు వెళ్లి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రాస్ టేలర్ తీరు ఏమాత్రం బాగా లేదు

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ "రాస్ టేలర్ తీరు ఏమాత్రం బాగా లేదు. బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేయడం అతని పని కాదు. ఇది దురదృష్టకరం. అతని పని బ్యాటింగ్ చేయడం. దానిపై దృష్టి సారిస్తే మంచిది. ఇదే విషయంపై నేను అంపైర్లకు ఫిర్యాదు చేశాను" అని అన్నాడు.

రాస్ టేలర్ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్

రాస్ టేలర్ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్

"రాస్ టేలర్ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్. అతడు ఇలాంటి పని చేయాల్సింది కాదు. గతంలో కూడా అతడు రెండు, మూడుసార్లు ఇలాగే చేశాడు. హఫీజ్ యాక్షన్‌లో ఎలాంటి లోపం లేదు. అనవసరంగా టేలర్ దాన్నో రాద్ధాంతం చేయాలని చూశాడు" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. హఫీజ్ బౌలింగ్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి.

50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసిన కివీస్

50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసిన కివీస్

ఐసీసీ ఇప్పటికే అతని బౌలింగ్‌పై మూడుసార్లు నిషేధం విధించడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. రాస్ టేలర్‌(80), లాంథమ్‌ (68) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో షహీన్‌ షా ఆఫ్రిది, షదబ్‌ ఖాన్‌ నాలుగేసి వికెట్లు పడగొట్టగా... ఇమాద్‌ వాసిం ఒక వికెట్‌ లభించింది.

47.2 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైన పాకిస్థాన్

47.2 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైన పాకిస్థాన్

అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్(64)‌, ఇమాద్‌ వాసిం(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బ్యాట్స్‌మెన్లను ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజాం, మహ్మద్‌ హఫీజ్‌లను వరుస బంతుల్లో పెలివియన్‌కు చేర్చాడు.

ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గుసన్‌ మూడు వికెట్లు తీయగా... గ్రాండ్‌ హోమ్ రెండు వికెట్లు తీసాడు. ఇష్ సోధికి ఒక వికెట్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, కివీస్ తరుపున వన్డేల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన మూడో పురుష బౌలర్‌గా ట్రెంట్‌ బౌల్ట్‌గా నిలిచాడు.

Story first published: Thursday, November 8, 2018, 17:31 [IST]
Other articles published on Nov 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X