న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తానియా.. మిథాలీలు లంకపై విజయాన్ని కొట్టేశారు!!

Sri Lanka's Women's Cricket Win By 7 Runs India
Taniya Bhatia, Mithali Raj help India to series win over Sri Lanka

హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భారత్ మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌‌షిప్‌లో భాగంగా గాలేలో ఈ టోర్నీ జరుగుతుండగా.. గురువారం ఉత్కంఠగా ముగిసిన రెండో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌‌‌ని 2-0తో కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరగనుంది.

హాఫ్ సెంచరీలతో చెలరేగిన మిథాలీ, భాటియా:

హాఫ్ సెంచరీలతో చెలరేగిన మిథాలీ, భాటియా:

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. తనియా భాటియా (68) 66 బంతుల్లో 9ఫోర్లు, కెప్టెన్ మిథాలీ రాజ్ (52) 121 బంతుల్లో 4 ఫోర్లు హాఫ్ సెంచరీలు సాధించడంతో సరిగ్గా 50 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌటైంది.

ఒకానొక దశలో శ్రీలంక అలవోకగా:

ఒకానొక దశలో శ్రీలంక అలవోకగా:

లక్ష్య ఛేదనలో చామరి ఆటపట్టు (57) 95 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు, శశికళ (49) 91 బంతుల్లో 6 ఫోర్లు, నీలాక్షి (31) 19 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు నిలకడగా ఆడటంతో శ్రీలంక అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించింది. ముఖ్యంగా నీలాక్షి భారీ షాట్లతో ఒక్కసారిగా మ్యాచ్‌ను లంకవైపు తిప్పింది.

శ్రీలంక 48.2 ఓవర్లలో 211 పరుగులకే

శ్రీలంక 48.2 ఓవర్లలో 211 పరుగులకే

ఆ జోరుతో ఒకానొక దశలో 165/7తో నిలిచిన శ్రీలంక 46.3 ఓవర్లు ముగిసే సమయానికి 205/7తో విజయానికి చేరువలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 207 వద్ద ఆమె ఔటవగా.. ఒత్తిడికి గురైన శ్రీలంక 48.2 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలిపోయింది.

రికార్డులు కొల్లగొడుతున్న మిథాలీ.. జులన్‌లు

రికార్డులు కొల్లగొడుతున్న మిథాలీ.. జులన్‌లు

భారత మహిళా క్రికెటర్లు జులన్ గోస్వామి.. మిథాలీ రాజ్‌లు కెరీర్‌లోనే అరుదైన మైలురాళ్లను దాటేశారు. గాలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో జులన్ గోస్వామి 300 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లోనే మిథాలీ రాజ్ కూడా అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించి మరో రికార్డును లిఖించారు.

Story first published: Friday, September 14, 2018, 10:46 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X