న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్‌పై బంగ్లా విజయం: తైజుల్‌కు 6, షకీబ్ సరికొత్త రికార్డు

Taijul takes six to seal Tigers win after Shakib makes history

హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై ఆతిథ్య బంగ్లాదేశ్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండిస్‌పై స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం.

తాజా విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండిస్ లంచ్ విరామ సమయానికి 11/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం బంగ్లా బౌలర్ల ధాటికి 139 పరుగులకే ఆలౌటైంది.

<strong>WATCH: తమ్ముడిని రక్షించేందుకు స్టంపింగ్ వదిలేసిన పాక్ క్రికెటర్(వీడియో)</strong>WATCH: తమ్ముడిని రక్షించేందుకు స్టంపింగ్ వదిలేసిన పాక్ క్రికెటర్(వీడియో)

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రెండో రోజైన శుక్రవారం బౌలర్లు 17 వికెట్లు పడగొట్టారు. ఇక, మూడో రోజైన శనివారం కూడా అదేజోరుని ప్రదర్శించి 15 వికెట్లు పడగొట్టారు. బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ టెస్టులో రెండు రోజుల్లో మొత్తం 32 వికెట్లు పడ్డాయి.

Windies vs Bangladesh 2018 1st Test Score, Commentary

మూడో రోజైన శనివారం టీ విరామ సమయానికి ముందే విండీస్ 139 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ కేవలం 8 సెషన్ల పాటు మాత్రమే జరిగింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్ (120)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఇక, బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేయడంతో పాటు 200 వికెట్లు తీసిన క్రికెటర్‌గా షకీబ్ ఉల్ హాసన్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ క్రికెట్ర ఇయాన్ బోథమ్ రికార్డుని అధిగమించాడు.

స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 324,
వెస్టిండిస్: 246

రెండో ఇన్నింగ్స్:
బంగ్లాదేశ్: 125,
వెస్టిండిస్: 139

మ్యాచ్ ఫలితం: బంగ్లా 64 పరుగుల తేడాతో విజయం

Story first published: Saturday, November 24, 2018, 16:35 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X