న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Bangladesh vs Afghanistan: ముక్కోణపు టీ20 సిరిస్ ఫైనల్, అందరి కళ్లు రషీద్‌పైనే!

T20I Tri-series 2019, Final, Bangladesh vs Afghanistan, Preview – Eyes on Rashid Khan

హైదరాబాద్: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరిస్‌లో ఆప్ఘనిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‍‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, జింబాబ్వే జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరిస్ జరుగుతోంది.

మంగళవారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ తలపడనుంది. అయితే, అంతకముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు రషీద్ ఖాన్ అందుబాటులో ఉంటాడా? లేదా అన్నది అనుమానంగా ఉంది.

వీడ్కోలు అనేది ఓ కళ: సన్నీ రైట్ కాల్, కపిల్‌పై విమర్శలు, మరి ధోని పరిస్థితి ఏంటో!వీడ్కోలు అనేది ఓ కళ: సన్నీ రైట్ కాల్, కపిల్‌పై విమర్శలు, మరి ధోని పరిస్థితి ఏంటో!

రషీద్ ఖాన్ గాయంపై ఆ జట్టు మేనేజర్ నజీం జర్ అబ్దుర్ రహీం జై మాట్లాడుతూ "రషీద్ ఖాన్ ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. గాయం నుంచికోలుకునేందుకు మరో రెండు లేదా మూడు రోజులు అవసరం" అని పేర్కొన్నాడు.

"అయితే, దీనిపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా జట్టు కెప్టెనే కాదు ప్రధాన ఆటగాడు కూడా. ఫైనల్‌కు మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అతడిని పూర్తిగా పర్యవేక్షిస్తాం" అని ఆప్ఘన్ జట్టు మేనేజర్ చెప్పుకొచ్చాడు. ఈ ముక్కోణపు సిరిస్‌లో ఆప్ఘన్ మంచి ప్రదర్శన చేస్తోంది.

జట్ల వివరాలు:
ఆప్ఘనిస్థాన్: రహమనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, అస్గర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జాద్రాన్, మొహమ్మద్ నబీ, గుల్బాదీన్ నాయబ్, షఫీకుల్లా షఫాక్, కరీం జనత్/ఫరీద్ మాలిక్, రషీద్ ఖాన్ (కెప్టెన్)/షరాఫుద్దీన్ అష్రాబ్, నవీన్ ము ఉల్

బంగ్లాదేశ్: లిటాన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో/మొహమ్మద్ నైమ్ షేక్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహముదుల్లా, సబ్బీర్ రెహ్మాన్, అఫీఫ్ హుస్సేన్, మొసాద్దెక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, షఫీల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రాహ్

మ్యాచ్ డిటేల్స్:
బంగ్లాదేశ్ v ఆప్ఘనిస్థాన్
షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, మిర్‌పుర్
మంగళవారం, 24 September: 12:30pm GMT

హెడ్ టు హెడ్:
మ్యాచ్‌లు - 6 | బంగ్లాదేశ్ గెలిచినవి - 2 | ఆప్ఘనిస్థాన్ గెలిచినవి - 4

గణాంకాలు:
54- Runs Sabbir Rahman needs to complete 1,000 T20I runs.

ప్రత్యక్ష ప్రసారం:
TV - స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 2
ఆన్ లైన్ - హాట్ స్టార్

Story first published: Monday, September 23, 2019, 19:32 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X