న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్‌కు దడ దినేష్ కార్తీక్: టీ20 వరల్డ్ కప్‌ కోసం సెలెక్టర్ల ఫస్ట్ ఛాయిస్‌గా

T20 World Cup: Should Rishabh Pant Be Worried about Dinesh Karthik

బెంగళూరు: భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మట్ కేప్టెన్ రిషభ్ పంత్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సిరీస్‌లో అతను ఘోరంగా విఫలం కావడమే దీనికి కారణం. బ్యాటర్‌గా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడీ వికెట్ కీపర్. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లల్లో ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేననే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతున్నాయి కూడా.

 రిషభ్‌కు ప్రత్యామ్నాయంగా..

రిషభ్‌కు ప్రత్యామ్నాయంగా..

వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్.. రిషభ్ పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడమే దీనికి ప్రధాన కారణం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన దినేష్ కార్తీక్.. సత్తా చాటిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌లల్లో 330 పరుగులతో రాణించాడు. దీనితో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక్కడా విజృంభించాడు. ఐపీఎల్ దూకుడును కంటిన్యూ చేశాడు.

అర్ధసెంచరీతో..

అర్ధసెంచరీతో..

వర్షం వల్ల రద్దయిన చివరి మ్యాచ్‌ను పక్కన పెడితే- మిగిలిన నాలుగింట్లో మంచి స్కోర్ నమోదు చేసుకున్నాడు. పక్కా టీ20 ఫార్మట్‌లో ఆడాడు. 158.6 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌ను రికార్డ్ చేసుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లల్లో 92 పరుగులు చేశాడు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. 55 పరుగులు సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో దినేష్ కార్తీక్‌కు ఇదే తొలి అర్ధసెంచరీ. ఈ సిరీస్‌తో దినేష్ కార్తీక్.. టీమిండియా టీ20 ఫార్మట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది.

సెలెక్టర్ల బెస్ట్ ఛాయిస్‌గా..

సెలెక్టర్ల బెస్ట్ ఛాయిస్‌గా..

టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్టర్ల బెస్ట్ ఛాయిస్‌గా నిలిచాడు. ఇది కాస్తా రిషభ్ పంత్‌ను ఆందోళనకు గురి చేస్తోందనడంలో సందేహాలు అక్కర్లేదు. రిషభ్ పంత్ స్థానానికి దినేష్ కార్తీక్ ఎసరు పెట్టినట్టే. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం దినేష్ కార్తీక్‌కు కలిసొచ్చినట్టయింది. దినేష్ కార్తీక్ సత్తా చాటిన దక్షిణాఫ్రికా సిరీస్‌లోనే రిషభ్ పంత్ విఫలం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు సైతం రిషభ్ కంటే దినేష్ కార్తీక్ బెటర్ అంటూ అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది.

బ్యాటింగ్ ఫెయిల్యూర్స్..

బ్యాటింగ్ ఫెయిల్యూర్స్..

ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ ఇప్పటివరకు 57 పరుగులు చేశాడు. యావరేజ్ 14.25. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 105.55తో బ్యాటింగ్ సాగుతోంది. తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 29, రెండో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో ఆరు, మూడో మ్యాచ్‌లో ఏడు బంతుల్లో అయిదు, నాలుగో మ్యాచ్‌లో 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు రిషభ్ పంత్. రద్దయిన బెంగళూరు మ్యాచ్‌లో ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.

Story first published: Monday, June 20, 2022, 11:50 [IST]
Other articles published on Jun 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X