న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: కాకతాళీయమో ఏమో గానీ.. అప్పుడు భారత్‌కు పట్టిన గతే.. ఇప్పుడు పాకిస్థాన్‌కు..!

 T20 World Cup 2022: Pakistan position likely to india situation in 2021 world cup

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురుకాగా.. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రోహిత్ సేనకు వచ్చే ఇబ్బంది పెద్దగా ఏం లేకున్నా.. పాకిస్థాన్ జట్టుకు తీవ్ర నష్టం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే.. పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు ఉండేవి. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్ సాధిస్తే ఆ జట్టు నాకౌట్ దశకు చేరేది. కానీ సౌతాఫ్రికా గెలవడంతో పాకిస్థాన్‌కు చాన్స్ లేకుండా పోయింది. భారత్ టోర్నీ నుంచి తప్పుకుంటే తప్పా ఇప్పుడు పాకిస్థాన్‌కు అవకాశం లేదు.

అప్పుడు భారత్ ఇలానే..

అప్పుడు భారత్ ఇలానే..

అయితే కాకతాళీయామో ఏమో గానీ.. గతేడాది భారత జట్టుకు పట్టిన గతే ఈసారి పాకిస్థాన్‌కు పట్టింది. దుబాయ్ వేదికగా భారత్ నిర్వహించిన ఆ టోర్నీలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓడిన కోహ్లీ సేన.. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలోనూ ఓడి సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలని కోరుకున్నా.. అది జరగకపోవడంతో తర్వాతి మ్యాచ్‌ల్లో అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్‌ను ఓడించినా.. నాకౌట్‌కు చేరలేకపోయింది. అప్పుడు భారత గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

 దాయాదీ దేశాలకు..

దాయాదీ దేశాలకు..

తాజా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన బాబర్ సేన.. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఖంగుతిన్నది. మూడో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిచినా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. తదుపరి మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై గెలిచినా పాక్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. గతేడాది భారత అభిమానులు లెక్కలేసుకున్నట్లే ఈ సారి పాక్ అభిమానులు సెమీస్ సమీకరణాలు పరిశీలిస్తున్నారు. మొత్తానికి రెండు దాయాదీ దేశాలకు ఒకే పరిస్థితి ఎదురవ్వడం గమ్మత్తయిన విషయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

భారత్‌కు సెమీస్ గండం..

భారత్‌కు సెమీస్ గండం..

గతేడాది గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. ఈ సారి భారత్ కూడా పాకిస్థాన్‌ తరహాలోనే సెమీస్‌లోనే వెనుదిరుగుతుందా? అనే ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నాకౌట్స్‌లో భారత్‌కు గండంలా తయారైన న్యూజిలాండ్‌తోనే భారత్ తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైన్‌తో పాటు 2021 డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్ ఓటములు భారత అభిమానులు అప్పుడే మరిచిపోలేరు.

ఇప్పటికీ సెమీస్ చాన్స్..

ఇప్పటికీ సెమీస్ చాన్స్..

గ్రూప్-2లో మూడు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం సాధించిన పాకిస్థాన్ 2 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రన్‌రేట్ కూడా మెరుగ్గా లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై భారీ విజయాలు సాధించాలి. అంతే కాకుండా భారత్.. బంగ్లా చేతిలో ఓడి, జింబాబ్వేపై తక్కువ మార్జిన్‌తో గెలిస్తే... మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాక్ కంటే భారత్‌కు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది. పాకిస్థాన్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే చాలు.. దాయాది సెమీస్ రేసు నుంచి వైదొలిగినట్టే. నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అద్భుతం జరిగితే తప్పా.. పాక్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

Story first published: Monday, October 31, 2022, 14:31 [IST]
Other articles published on Oct 31, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X