న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: 1992 సెంటిమెంట్ ఏమాయేరా ఆజామూ.. పాక్ ఓటమిపై పేలుతున్న సెటైర్లు!

T20 World Cup 2022: Babar Azam brutally trolled after England beat Pakistan in final

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అసాధారణ ఆటతో రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా పాకిస్థాన్ అద్భుతంగా పోరాడింది. బ్యాటర్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. అయినా బౌలర్లు ఆఖరి వరకు తమ పోరాటాన్ని కనబర్చారు.

అయితే అనూహ్యంగా సెమీఫైనల్‌‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. దాంతో ఆ జట్టు అభిమానులతో పాటు పాక్ ప్రధాని, పీసీబీ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్లకు గర్వం తలెక్కింది. తమదే టైటిలని, 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఓరి ఆజామూ..

నమ్మకంగా ఉండటమే కాదు.. తమ విశ్వవిజేతలం అంటూ ఇతర జట్లను అవహేళన చేశారు. ముఖ్యంగా ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిన తర్వాత 1992 సెంటిమెంట్ రిపీట్ అని, భారత జట్టు కంటే తమ జట్టు బలమైనదని ప్రగాల్భాలు పలికారు. కానీ ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా రావడంతో భారత నెటిజన్లు పాకిస్థాన్ జట్టును సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ ఆజామూ.. ఏమాయేరా? మీ 1992 సెంటిమెంట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

సెంటిమెంట్ లేదు.. గింటిమెంట్ లేదు!

1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. దాంతో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందే 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓడుతుందని పాక్ అభిమానులు జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్ ముద్దాడుతుందన్నారు. రెండు ఫైనల్లో కూడా పాక్ నోబాల్‌తోనే ఖాతా తెరిచిందని, ఫలితంలో కూడా మార్పు ఉండదని కూడా కామెంట్ చేశారు. కానీ బెన్ స్టోక్స్ పోరాటం ముందు ఈ సెంటిమెంట్ కొట్టుకుపోయింది.

సామకరన్ తీన్మార్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.

స్టోక్స్ విరోచిత పోరాటం..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్‌(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు. కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Sunday, November 13, 2022, 17:46 [IST]
Other articles published on Nov 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X