న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: టైటిల్ ఫైట్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సై! ఎవరి బలం ఎంతంటే?

T20 World Cup 2021, Final: New Zealand vs Australia Preview: strengths and weaknesses

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 తుది దశకు చేరకుంది. హాట్ ఫేవరేట్ జట్లన్నీ ఒక్కొక్కటిగా ఇంటిదారిపట్టగా ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అద్వితీయమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరాయి. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న టీమిండియా సూపర్‌-12 దశను కూడా దాటలేదు. సూపర్‌-12లో ఘనవిజయాలతో ఫేవరెట్లుగా అవతరించిన ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ సెమీస్‌ గడప దాటలేకపోయాయి. ఇప్పటిదాకా కప్పు గెలవని, పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఇప్పుడు కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

సూపర్-12 స్టేజ్‌లో సాదా సీదాగా ఆడిన ఈ రెండు జట్లు సెమీఫైనల్లో మాత్రం దుమ్మురేపాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్ పాకిస్థాన్ చేతిలో.. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయాయి. అయితే అనూహ్యంగా సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓకే తరహాలో ఓడించాయి. రెండు సెమీఫైనల్స్ ఛేజింగ్ 19 ఓవర్లలోనే ముగియడం విశేషం. అయితే ఈ ఇరు జట్లలో ఫేవరేట్ ఎవరో చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.

పటిష్టంగా ఆస్ట్రేలియా..

పటిష్టంగా ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తున్నది. ఓపెనర్ల నుంచి లోయర్ మిడిల్ వరకు అందరూ బ్యాటుతో సత్తా చాటే వారే. డేవిడ్ వార్నర్, ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్‌ల రూపంలో చాలా లోతుగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. పాట్ కమిన్స్ కూడా భారీ సిక్సర్లు బాదగలడు. వీరిని అడ్డుకోవాలంటే న్యూజిలాండ్ ప్రత్యేకమైన బౌలింగ్ ప్రణాళికలతో రావాల్సిందే. ఫించ్, స్మిత్, మ్యాక్సీలు సెమీస్‌లో విఫలమయ్యారు. అయితే వార్నర్ మంచి ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు బాగా కలసొచ్చే అంశం. ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకొని మరింత ధాటిగా బ్యాటింగ్ చేస్తే ఆసీస్‌కు తిరుగుండదు.

బౌలింగే సరిచేసుకోవాలి..

బౌలింగే సరిచేసుకోవాలి..

అయితే ఆసీస్ బౌలింగ్ మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బౌలర్లు కాస్త తడబడ్డారు. భారీగా పరుగులు ఇస్తున్నారు. ఈ విషయంలో కాస్త వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ త్వరగా వికెట్లు తీయగలిగితే.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.

అడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్లు పెద్దగా తీయలేకపోతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆసీస్ బౌలర్లు దారళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ తప్పిదం సరిచేసుకుంటే ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మిగిలిన టీ20 ప్రపంచకప్ టైటిల్ ఆసీస్ సొంతమవుతోంది.

ఆ ఒక్కటి తప్పా..

ఆ ఒక్కటి తప్పా..

న్యూజిలాండ్ కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతం. అయితే కీలక మ్యాచ్‌కు డేవాన్ కాన్వే సేవలను కోల్పోవడం ఆ జట్టుకు తీరని లోటు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మార్టిన్ గప్టిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా.. ఈ టోర్నీలో అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

ఇక డారిల్ మిచెల్ సెమీఫైనల్లో హీరోగా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో సమయోచితంగా ఆడుతూ జట్టుకు అద్బుత విజయాలందించాడు. కేన్ విలియమ్సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన రోజున చెలరేగిపోతాడు. ఇక టీ20 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గ్లెన్ ఫిలిప్ ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జేమ్స్ నీషమ్ బ్యాట్ దుమ్మురేపాడు. మరోసారి అతను తన హిట్టింగ్ రోల్ పోషిస్తే ఆసీస్‌కు కష్టమే. కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే నెంబర్ 6 వరకు అందరూ హార్డ్ హిట్టర్లే.

ఫీల్డింగ్ సూపరో సూపర్..

ఫీల్డింగ్ సూపరో సూపర్..

ఇక బౌలింగ్ అయితే పూర్తి పటిష్టంగా ఉన్నది. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ స్పెషలిస్ట్ టీ20 బౌలర్లు. ఐపీఎల్‌తో పాటు ఈ టోర్నీలో కూడా వారి సామర్థ్యాలు ఏమిటో అందరూ చూశారు. వీరికి తోడుగా అడమ్ మిల్నే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. ఇష్ సోథి, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్ విభాగం బలాన్ని పెంచుతున్నారు.

సూపర్ బౌలింగ్‌కు మెస్మరైజింగ్ ఫీల్డింగ్ జట్టుకు లాభం చేస్తుంది. బౌండరీ లైన్ వద్ద న్యూజిలాండ్ ఆటగాళ్ల ఫీల్డింగ్ విన్యాసాలు ఇప్పటికే అభిమానులను అలరించాయి. భారీ సిక్సర్లను అడ్డుకోవడం.. అద్భుతంగా క్యాచ్‌లు అందుకోవడం న్యూజిలాండ్ స్పెషాలిటీ. ఫైనల్లో కూడా సమష్టిగా రాణిస్తే కివీస్‌ చాంపియన్‌గా నిలవడం ఖాయం.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి జరిగే మ్యాచ్‌లపై మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటున్నది. అందుకే టాస్ చాలా కీలకంగా మారనున్నది. టాస్ గెలిచిన జట్టు తప్పకుండా బౌలింగ్ చేయడానికే ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కడం కష్టంగా మారుతుంది. పిచ్ కూడా ఆరంభంలో బౌలింగ్‌కు అనుకూలిస్తే తర్వాత బ్యాట్స్‌మన్‌కు సులువవుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు చేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. ఆ ఒక్క మ్యాచ్‌ కూడా స్కాట్లాండ్‌పై న్యూజిలాండే గెలిచింది. ఈ క్రమంలోనే మరోసారి టాస్ కీలకం కానుంది.

Story first published: Saturday, November 13, 2021, 11:17 [IST]
Other articles published on Nov 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X