న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన కార్తీక్‌లు‌.. వరుసగా రెండోసారి ఫైనల్‌కు తమిళనాడు! బరోడాతో అమితుమీ!

Syed Mushtaq Ali Trophy: Baroda beats Punjab to set up Tamil Nadu final clash

అహ్మదాబాద్‌: ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఫైనల్‌కు తమిళనాడు, బరోడా జట్లు దూసుకెళ్లాయి. శుక్రవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలుపొందింది. ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో వరుసగా రెండో సీజన్‌లోనూ తమిళనాడు ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీస్‌లో బరోడా 25 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తుచేసింది. ఆదివారం జరిగే తుది పోరులో టైటిల్‌ కోసం తమిళనాడు, బరోడా జట్లు తలపడనున్నాయి.

హెల్త్ బులెటిన్‌.. క్రిటికల్‌ కేర్‌ నుంచి ప్రత్యేక గదికి సౌరవ్ గంగూలీ!!హెల్త్ బులెటిన్‌.. క్రిటికల్‌ కేర్‌ నుంచి ప్రత్యేక గదికి సౌరవ్ గంగూలీ!!

మెరిసిన కార్తీక్‌లు:

తొలి సెమీస్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ అశోక్‌ మనేరియా (51; 32 బంతుల్లో 5×4, 2×6), అర్జిత్‌ గుప్తా (45; 35 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. తమిళనాడు బౌలర్‌ ఎం మహమ్మద్‌ (4/24) కట్టడి చేయడంతో రాజస్థాన్‌ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టాప్‌-3 బ్యాట్స్‌మన్‌ విఫలమైనా.. అరుణ్‌ కార్తీక్‌ (54 బంతుల్లో 89 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (17 బంతుల్లో 29) కూడా చెలరేగడంతో మరో 8 బంతులు ఉండగానే తమిళనాడు విజయాన్ని అందుకుంది.

పంజాబ్‌పై బరోడా విజయం:

రెండో సెమీస్‌లో పంజాబ్‌పై బరోడా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. కెప్టెన్‌ కేదర్‌ దేవ్‌ధర్‌ (64; 49 బంతుల్లో 4×4, 3×6), కార్తీక్‌ కాకడే (53; 41 బంతుల్లో 5×4, 2×6) అర్ధ శతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 160 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (0/24) వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ (42 నాటౌట్‌), గుర్‌కీరత్‌ సింగ్‌ (39) మినహా మిగిలిన వారు విఫలమవడంతో పంజాబ్‌ 8 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. బరోడా బౌలర్లు లక్మన్‌ మెరివాలా (3/28), నినాద్‌ రత్వా (2/28), బాబాషఫి (1/25) పంజాబ్‌ను దెబ్బతీశారు.

టైటిల్‌ కోసం తమిళనాడుతో బరోడా ఢీ:

ఆదివారం జరిగే తుది పోరులో టైటిల్‌ కోసం తమిళనాడు, బరోడా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈమ్యాచులో తమిళనాడు జట్టుది కాస్త పైచేయిగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, బాబా అపరాజిత్, అరుణ్ కార్తీక్, మురుగన్ అశ్విన్, ఎన్ జగదీసన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు క్రునాల్ పాండ్యా, ధ్రువ్ పటేల్, విష్ణు సోలంకి, కేదర్‌ దేవ్‌ధర్‌ లాంటి ఆటగాళ్లు బరోడా జట్లులో ఉన్నారు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Story first published: Saturday, January 30, 2021, 11:19 [IST]
Other articles published on Jan 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X